Imdugu baasa yichcheda yidu nee yimtigi raanu

ఇందుకు బాస యిచ్చెద యిటు నీ యింటికి రాను
Language

(॥పల్లవి॥)
ఇందుకు బాస యిచ్చెద యిటు నీ యింటికి రాను
చెంది నీ సతులు యింత చేసిరి నీ గుణము

(॥ఇందుకు॥)
నవ్వుతా దగ్గరి వచ్చినాను సరకు గొనవు
యెవ్వరితో మాట లాడే విపుడు నీవు
మువ్వంక నీరాజాసము మున్నిటివంటిదా నేఁడు
రివ్వలుగా సతు లెల్ల రేఁచిరి నీగుణము

(॥ఇందుకు॥)
బడి బడి మొక్కినాను పరా కై వున్నాఁడవు
కడు దొర వైతి నీకుఁ గాన వచ్చీనా
కడఁగి మావంటివారిఁ గైకొనేవా గొల్లెతలు
బెడసుగొల్ల మంకుతోఁ బెంచిరి నీగుణము

(॥ఇందుకు॥)
యిట్టె చేయి వట్టినాను యించు కంతాఁ దెమలవు
నెట్టుకొన నీబిగువు నేఁడు గొత్తలా
నెట్టన శ్రీవెంకటేశ నే నల మేలుమంగను
జట్టిగొని కూడితివి సాజమే నీగుణము

(||pallavi||)
iṁdugu bāsa yichchĕda yiḍu nī yiṁṭigi rānu
sĕṁdi nī sadulu yiṁta sesiri nī guṇamu

(||iṁdugu||)
navvudā daggari vachchinānu saragu gŏnavu
yĕvvarido māḍa lāḍe vibuḍu nīvu
muvvaṁka nīrājāsamu munniḍivaṁṭidā nem̐ḍu
rivvalugā sadu lĕlla rem̐siri nīguṇamu

(||iṁdugu||)
baḍi baḍi mŏkkinānu parā kai vunnām̐ḍavu
kaḍu dŏra vaidi nīgum̐ gāna vachchīnā
kaḍam̐gi māvaṁṭivārim̐ gaigŏnevā gŏllĕdalu
bĕḍasugŏlla maṁkudom̐ bĕṁchiri nīguṇamu

(||iṁdugu||)
yiṭṭĕ seyi vaṭṭinānu yiṁchu kaṁtām̐ dĕmalavu
nĕṭṭugŏna nībiguvu nem̐ḍu gŏttalā
nĕṭṭana śhrīvĕṁkaḍeśha ne nala melumaṁganu
jaṭṭigŏni kūḍidivi sājame nīguṇamu