ఇందుకొరకే వచ్చితి నిదె నీ సముకానకు
(॥పల్లవి॥)
ఇందుకొరకే వచ్చితి నిదె నీ సముకానకు
చందము సేయఁగ నీవే చతురుఁడవయ్యా
(॥ఇందు॥)
చేరఁడంతలుకన్నుల చెలి నిన్నుఁ జూచితేను
మూరెఁడంతపొడవుక్రుమ్ముడి వీడెను
యీరుదియ్యఁ బేనువచ్చె నిదివో నీపై వలపు
సారెసారె యీపనులు చక్కఁబెట్టవయ్యా
(॥ఇందు॥)
జుట్టెడేసిపాదములజోటి నీవద్దికి రాఁగా
పట్టెఁడేసిచన్నులపై పయ్యద జారె
అట్టె కలి ముదిరి మెట్టాయ నీతో పొందులు
నెట్టన నీతబ్బిబ్బులు నీవే దిద్దవయ్యా
(॥ఇందు॥)
గొరెఁడంతచంద్రవంక గురుతు నీకుఁ బెట్టితే
బారెఁడు గాఁగిట గూడి పంతమిచ్చేవు
యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
నీరుకొద్ది తామరాయ నేఁడు మెచ్చవయ్యా
(||pallavi||)
iṁdugŏrage vachchidi nidĕ nī samugānagu
saṁdamu seyam̐ga nīve sadurum̐ḍavayyā
(||iṁdu||)
seram̐ḍaṁtalugannula sĕli ninnum̐ jūsidenu
mūrĕm̐ḍaṁtabŏḍavukrummuḍi vīḍĕnu
yīrudiyyam̐ benuvachchĕ nidivo nībai valabu
sārĕsārĕ yībanulu sakkam̐bĕṭṭavayyā
(||iṁdu||)
juṭṭĕḍesibādamulajoḍi nīvaddigi rām̐gā
paṭṭĕm̐ḍesisannulabai payyada jārĕ
aṭṭĕ kali mudiri mĕṭṭāya nīdo pŏṁdulu
nĕṭṭana nīdabbibbulu nīve diddavayyā
(||iṁdu||)
gŏrĕm̐ḍaṁtasaṁdravaṁka gurudu nīgum̐ bĕṭṭide
bārĕm̐ḍu gām̐giḍa gūḍi paṁtamichchevu
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
nīrugŏddi tāmarāya nem̐ḍu mĕchchavayyā