ఇందుకొరకే సుమ్మీ యింటిలో నున్నది సతి
(॥పల్లవి॥)
ఇందుకొరకే సుమ్మీ యింటిలో నున్నది సతి
కందువకు వచ్చి నీవే కాంత నేలవయ్యా
(॥ఇందు॥)
నోరికిఁ దోఁచినట్టెల్లా నుడుగఁగఁ బోతేను
నేరుపుతోడ గుట్టు మానిసి యనరు
కారు కమ్మి చూపులను కన్నదెల్లాఁ జూచితేను
యీరీతి మిక్కిలి ప్రౌఢ యీకె యనరు
(॥ఇందు॥)
మోము చూచినపుడెల్లా మునుకొని నవ్వితేను
కామించి మిక్కిలి సిగ్గు గల దనరు
వేమారు నెదుటను వేడుకఁ బొలసితేను
అనుకొని కడు జాణయైన దీకె యనరు
(॥ఇందు॥)
చలివాసి కొలువులో సంగడిఁ గూచుండితేను
లలి వినయపుగుణాలది యనరు
యెలిమి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
కలసితి వింతటిది గాకున్న నౌ ననరు
(||pallavi||)
iṁdugŏrage summī yiṁṭilo nunnadi sadi
kaṁduvagu vachchi nīve kāṁta nelavayyā
(||iṁdu||)
norigim̐ dom̐sinaṭṭĕllā nuḍugam̐gam̐ bodenu
nerubudoḍa guṭṭu mānisi yanaru
kāru kammi sūbulanu kannadĕllām̐ jūsidenu
yīrīdi mikkili prauḍha yīgĕ yanaru
(||iṁdu||)
momu sūsinabuḍĕllā munugŏni navvidenu
kāmiṁchi mikkili siggu gala danaru
vemāru nĕduḍanu veḍugam̐ bŏlasidenu
anugŏni kaḍu jāṇayaina dīgĕ yanaru
(||iṁdu||)
salivāsi kŏluvulo saṁgaḍim̐ gūsuṁḍidenu
lali vinayabuguṇāladi yanaru
yĕlimi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
kalasidi viṁtaḍidi gāgunna nau nanaru