ఇందుకొరకే నిన్ను నింతేసి కొసరితిమి
(॥పల్లవి॥)
ఇందుకొరకే నిన్ను నింతేసి కొసరితిమి
సందడిఁ బంతాన నిన్ను జరయము సుమ్మీ
(॥ఇందు॥)
మలసి సొలసి నిన్ను మాటలాడించకుండితే
తలఁపు దెలుసునా తరుణులకు
పిలిచి ని న్నింటికి రప్పించకుండితే నీ-
వలపుకొలఁ దెఱగవచ్చునా మాకు
(॥ఇందు॥)
చెనకి చెనకి నిన్ను చిమ్మిరేఁచకుండితేను
ఘనుఁడవు నీగుణము కానవచ్చునా
తనువు సోఁకించి నీకు తమి వుట్టించకుండితే
అనిశము నీగుట్టు అరయఁగవచ్చునా
(॥ఇందు॥)
కరఁగించి మరిగించి కాఁగిలించకుండితేను
సరి నీవేడుక చెల్లించఁగవచ్చునా
ఇరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
పరగ నన్నేలితివి పాయ నిఁక వచ్చునా
(||pallavi||)
iṁdugŏrage ninnu niṁtesi kŏsaridimi
saṁdaḍim̐ baṁtāna ninnu jarayamu summī
(||iṁdu||)
malasi sŏlasi ninnu māḍalāḍiṁchaguṁḍide
talam̐pu dĕlusunā taruṇulagu
pilisi ni nniṁṭigi rappiṁchaguṁḍide nī-
valabugŏlam̐ dĕṟagavachchunā māgu
(||iṁdu||)
sĕnagi sĕnagi ninnu simmirem̐saguṁḍidenu
ghanum̐ḍavu nīguṇamu kānavachchunā
tanuvu som̐kiṁchi nīgu tami vuṭṭiṁchaguṁḍide
aniśhamu nīguṭṭu arayam̐gavachchunā
(||iṁdu||)
karam̐giṁchi marigiṁchi kām̐giliṁchaguṁḍidenu
sari nīveḍuga sĕlliṁcham̐gavachchunā
iravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
paraga nannelidivi pāya nim̐ka vachchunā