Imdugem gaam gamtivamma yitti dayyamunu neevu

ఇందుకేఁ గాఁ గంటివమ్మ యిట్టి దయ్యమును నీవు
Language

(॥పల్లవి॥)
ఇందుకేఁ గాఁ గంటివమ్మ యిట్టి దయ్యమును నీవు
కందువ నిందుకు నాజ్ఞ గలదో లేదో

(॥ఇందు॥)
వెన్నలెల్ల తా మెసఁగి వేళ్లు తా క్రిష్ణుఁ డా ఇంటి
చిన్నికోడలిమూఁతి నించి కే చమరె
వెన్న మూఁతి చూచి అత్త వేగమె కోడలిఁ గొట్టె
ఇన్నేసి ఆగడాలు యీతని వోయమ్మా

(॥ఇందు॥)
వొకరింటి పురుగు దా గొగి రుత్తబాన లెల్ల
యెగ సక్కేలకుఁ బొరుగింటఁ బెట్టెను
వొకరొకరి మొత్తిరి హోరాహోరిగాఁగాను
కకపిక నవ్వుకొంటా కడనుండె నమ్మా

(॥ఇందు॥)
వొట్టుచు బాలునినోర వొకబానెఁడు జున్ను
పెట్టి తురిగి వచ్చె వూపిరి వెళ్లదు
యెట్టయిన నీవె సుమ్మీ యీపిన్నవానికిని
పట్టీశ్రీవేంకటపతి బలువుఁడో యమ్మా

(||pallavi||)
iṁdugem̐ gām̐ gaṁṭivamma yiṭṭi dayyamunu nīvu
kaṁduva niṁdugu nājña galado ledo

(||iṁdu||)
vĕnnalĕlla tā mĕsam̐gi veḽlu tā kriṣhṇum̐ ḍā iṁṭi
sinnigoḍalimūm̐ti niṁchi ke samarĕ
vĕnna mūm̐ti sūsi atta vegamĕ koḍalim̐ gŏṭṭĕ
innesi āgaḍālu yīdani voyammā

(||iṁdu||)
vŏgariṁṭi purugu dā gŏgi ruttabāna lĕlla
yĕga sakkelagum̐ bŏrugiṁṭam̐ bĕṭṭĕnu
vŏgarŏgari mŏttiri horāhorigām̐gānu
kagabiga navvugŏṁṭā kaḍanuṁḍĕ nammā

(||iṁdu||)
vŏṭṭusu bāluninora vŏgabānĕm̐ḍu junnu
pĕṭṭi turigi vachchĕ vūbiri vĕḽladu
yĕṭṭayina nīvĕ summī yībinnavānigini
paṭṭīśhrīveṁkaḍabadi baluvum̐ḍo yammā