Imdugela va(keva?)lasidi mimtulamu

ఇందుకేల వ(కేవ?)లచితి మింతులము
Language

(॥పల్లవి॥)
ఇందుకేల వ(కేవ?)లచితి మింతులము
పందెపు మరుపూబంతులము

(॥ఇందు॥)
మలకలయిన నీమాటలు
యెలయింపులకును యేటలు
పలుమరుఁ బాడేటి పాటలు
తెలిగన్నులకును తేటలు

(॥ఇందు॥)
నడుమంత్రపు నీనగవులు
తడవినవారికి తగవులు
బెడిదపుఁ జూపుల బిగువులు
యెడయనియాసల యెగువదిగువలు

(॥ఇందు॥)
కలయ నీకాఁగిటి కరఁగులు
తెలియఁగలుగు రతితెరఁగులు
కలసితి శ్రీ వేంకటపతి ననునిటు
మలసిన మర్మపు మరఁగులు

(||pallavi||)
iṁdugela va(keva?)lasidi miṁtulamu
paṁdĕbu marubūbaṁtulamu

(||iṁdu||)
malagalayina nīmāḍalu
yĕlayiṁpulagunu yeḍalu
palumarum̐ bāḍeḍi pāḍalu
tĕligannulagunu teḍalu

(||iṁdu||)
naḍumaṁtrabu nīnagavulu
taḍavinavārigi tagavulu
bĕḍidabum̐ jūbula biguvulu
yĕḍayaniyāsala yĕguvadiguvalu

(||iṁdu||)
kalaya nīgām̐giḍi karam̐gulu
tĕliyam̐galugu radidĕram̐gulu
kalasidi śhrī veṁkaḍabadi nanuniḍu
malasina marmabu maram̐gulu