ఇందుకేల లోఁగేవు యెప్పుడూ నీకుఁ గలదే
(॥పల్లవి॥)
ఇందుకేల లోఁగేవు యెప్పుడూ నీకుఁ గలదే
మందలించి దూరను మరిగితి నిన్నును
(॥ఇందు॥)
చిగురుమోవిగంటికి సిగ్గులువడఁగనేల
మొగము చూడవయ్య మొక్కే నేను
ఆగడు సేసినదాని ననవయ్య; నేము నిన్ను
యెగసక్కేలాడేమా యేల నీకు వెఱపు
(॥ఇందు॥)
బడలిక గాకుండా పలుకకుండఁగనేల
కడుఁజేయి చాంచవయ్య కానుకిచ్చేను
జడియ నలయించినసతినే అనుటగాక
సడిఁబెట్టేనా నిన్ను సారెనేల వెఱపు
(॥ఇందు॥)
అంగపువాసనకుఁగా అండకు రాకుండనేల
కొంగి శ్రీవేంకటేశ కూడితి నేను
అంగడిఁ బెట్టినదాని సనరా; నే నలమేలు
మంగను నన్నేలితివి మరి యేల వెఱపు
(||pallavi||)
iṁdugela lom̐gevu yĕppuḍū nīgum̐ galade
maṁdaliṁchi dūranu marigidi ninnunu
(||iṁdu||)
sigurumovigaṁṭigi sigguluvaḍam̐ganela
mŏgamu sūḍavayya mŏkke nenu
āgaḍu sesinadāni nanavayya; nemu ninnu
yĕgasakkelāḍemā yela nīgu vĕṟabu
(||iṁdu||)
baḍaliga gāguṁḍā palugaguṁḍam̐ganela
kaḍum̐jeyi sāṁchavayya kānugichchenu
jaḍiya nalayiṁchinasadine anuḍagāga
saḍim̐bĕṭṭenā ninnu sārĕnela vĕṟabu
(||iṁdu||)
aṁgabuvāsanagum̐gā aṁḍagu rāguṁḍanela
kŏṁgi śhrīveṁkaḍeśha kūḍidi nenu
aṁgaḍim̐ bĕṭṭinadāni sanarā; ne nalamelu
maṁganu nannelidivi mari yela vĕṟabu