ఇందుకేపో మోనమున నేమీ ననకున్నదాన
(॥పల్లవి॥)
ఇందుకేపో మోనమున నేమీ ననకున్నదాన
ముందుముందే చెనకితే మొగచాటై వుండును
(॥ఇందు॥)
పిలిచితేరానిఁ బెనఁగులాటకుఁ జొచ్చి
బలిమినేయఁగబోతే పసురువేసు
నిలిచి మాటాడకుంటే నేరుపులు పచరించి
చలము సాదించఁబోతే చవిదప్పును
(॥ఇందు॥)
మొక్కితేఁ జూడనివాని మొగ మెదుటనే వుండి
పుక్కట నవ్వు నవ్వితే పులుసువేసు
అక(క్క?) రెరఁగకుండఁగా నాయము లంటియంటి
చక్కులు నొక్కఁగఁబోతే సెలవు లేదు
(॥ఇందు॥)
కాఁగిట నలసేవానిఁ గరఁగించఁబోతేను
వీఁగుచు నొగరొగరై వెగటువేసు
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశ నన్ను
మాఁగినమోవియ్యకుంటే ముందువేసును
(||pallavi||)
iṁdugebo monamuna nemī nanagunnadāna
muṁdumuṁde sĕnagide mŏgasāḍai vuṁḍunu
(||iṁdu||)
pilisiderānim̐ bĕnam̐gulāḍagum̐ jŏchchi
balimineyam̐gabode pasuruvesu
nilisi māḍāḍaguṁṭe nerubulu pasariṁchi
salamu sādiṁcham̐bode savidappunu
(||iṁdu||)
mŏkkidem̐ jūḍanivāni mŏga mĕduḍane vuṁḍi
pukkaḍa navvu navvide pulusuvesu
aga(kka?) rĕram̐gaguṁḍam̐gā nāyamu laṁṭiyaṁṭi
sakkulu nŏkkam̐gam̐bode sĕlavu ledu
(||iṁdu||)
kām̐giḍa nalasevānim̐ garam̐giṁcham̐bodenu
vīm̐gusu nŏgarŏgarai vĕgaḍuvesu
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśha nannu
mām̐ginamoviyyaguṁṭe muṁduvesunu