ఇందుకే యీపాటి ఆయ నెక్కుడైతే నిఁకనెంతో
(॥పల్లవి॥)
ఇందుకే యీపాటి ఆయ నెక్కుడైతే నిఁకనెంతో
సందడి మేను సోఁకితే చనవెంత ఇత్తువో
(॥ఇందు॥)
కలికి యీజవరాలు కన్నుల నీకు మొక్కితే
సెలవుల నవ్వితివి చెలరేఁగి
బలిమిసేసి నీపాదాలు వట్టుకొంటే
కలసిమెలసి యెంత కాఁగిలింతువో
(॥ఇందు॥)
పలుకుఁదేనెలు నీకు పైపైఁ జవులు చూపితే
కళలు మోమున నించి కరఁగితివి
వెలయ మోవిరసాల విందులు నీకుఁ బెట్టితే
పిలిచి యీపెకెంత ప్రియము చెప్పుదువో
(॥ఇందు॥)
తొక్కుక నీతొడమీఁద దొయ్యలి గూచుండితేను
యిక్కువ శ్రీవేంకటేశ యెనసితివి
మిక్కిలి నీవురముపై మేడగట్టింపించుకొనె
అక్కరతో నిందుకెంత అలరుదువో
(||pallavi||)
iṁduge yībāḍi āya nĕkkuḍaide nim̐kanĕṁto
saṁdaḍi menu som̐kide sanavĕṁta ittuvo
(||iṁdu||)
kaligi yījavarālu kannula nīgu mŏkkide
sĕlavula navvidivi sĕlarem̐gi
balimisesi nībādālu vaṭṭugŏṁṭe
kalasimĕlasi yĕṁta kām̐giliṁtuvo
(||iṁdu||)
palugum̐denĕlu nīgu paibaim̐ javulu sūbide
kaḽalu momuna niṁchi karam̐gidivi
vĕlaya movirasāla viṁdulu nīgum̐ bĕṭṭide
pilisi yībĕgĕṁta priyamu sĕppuduvo
(||iṁdu||)
tŏkkuga nīdŏḍamīm̐da dŏyyali gūsuṁḍidenu
yikkuva śhrīveṁkaḍeśha yĕnasidivi
mikkili nīvuramubai meḍagaṭṭiṁpiṁchugŏnĕ
akkarado niṁdugĕṁta alaruduvo