ఇందుకే వెరగయ్యీని ఇటు నిన్నుఁ జూచి నాకు
(॥పల్లవి॥)
ఇందుకే వెరగయ్యీని ఇటు నిన్నుఁ జూచి నాకు
కందువ నీ నేరుపెల్లాఁ గానవచ్చెనే
(॥ఇందు॥)
పొదిగి నాపతితోను పొత్తుల మాటలాడేవు
కదిసి చుట్టరికము గలపేవు
అదనఁ బెండ్లిపీఁటపై నండఁ గూచుండవచ్చేవు
ఇదివో నీజాణతన మేమి చెప్పేదే
(॥ఇందు॥)
ఆతనివదినెనంటా నట్టె వావులు చెప్పేవు
కాతరాన వట్టివూడిగాలు సేసేవు
చేతిలోనివిడేనకు చెఱఁగు నీవొగ్గేవు
యేతరి నీయాసోద మేమిచెప్పేదే
(॥ఇందు॥)
యిద్దరము నుండఁగాను యేకతములాడేవు
అద్దుక యితనికి పయ్యద గప్పేవు
వొద్దిక శ్రీవేంకటేశుఁ డొనర నన్నేలినాఁడు
యిద్దెన నీమంచితన మేమిచెప్పేదే
(||pallavi||)
iṁduge vĕragayyīni iḍu ninnum̐ jūsi nāgu
kaṁduva nī nerubĕllām̐ gānavachchĕne
(||iṁdu||)
pŏdigi nābadidonu pŏttula māḍalāḍevu
kadisi suṭṭarigamu galabevu
adanam̐ bĕṁḍlibīm̐ṭabai naṁḍam̐ gūsuṁḍavachchevu
idivo nījāṇadana memi sĕppede
(||iṁdu||)
ādanivadinĕnaṁṭā naṭṭĕ vāvulu sĕppevu
kādarāna vaṭṭivūḍigālu sesevu
sediloniviḍenagu sĕṟam̐gu nīvŏggevu
yedari nīyāsoda memisĕppede
(||iṁdu||)
yiddaramu nuṁḍam̐gānu yegadamulāḍevu
adduga yidanigi payyada gappevu
vŏddiga śhrīveṁkaḍeśhum̐ ḍŏnara nannelinām̐ḍu
yiddĕna nīmaṁchidana memisĕppede