ఇందుకే వెరగయ్యీ నిట్టి నీమాయలు చూచి
(॥పల్లవి॥)
ఇందుకే వెరగయ్యీ నిట్టి నీమాయలు చూచి
విందుల నీ సుద్దులెల్లా వేడుకాయను
(॥ఇందుకే॥)
కన్నుల నిన్నుఁ జూడక కా కరేగినట్టమేను
సన్న నీవు సేసితేనే చల్లనాయరా
వెన్నెల వేఁడికి గాక విసిగేటినామనసు
చిన్నినవ్వుల కట్టే చెలరేఁగెరా
(॥ఇందుకే॥)
ఊరకేచల్లగాలికి ఉస్సురనే నిట్టూర్పు
ఆరసి నీతావిచే పయ్యరవారెను
జోరున మేఘము చూచి జొబ్బిలేటిచెమటలు
తారి నీకరుణ నిట దప్పిదేరెను
(॥ఇందుకే॥)
గుట్టున కోవెలకూఁతకును జల్లురనే గుండె
ముట్టి నిన్నుఁ గౌఁగిలించి మోహించేరా
యిట్టే శ్రీవేంకటేశ యింత సేసి కూడితివి
ఱట్టు పడ్డ నావయ సాలుడి కెక్కెను
(||pallavi||)
iṁduge vĕragayyī niṭṭi nīmāyalu sūsi
viṁdula nī suddulĕllā veḍugāyanu
(||iṁduge||)
kannula ninnum̐ jūḍaga kā kareginaṭṭamenu
sanna nīvu sesidene sallanāyarā
vĕnnĕla vem̐ḍigi gāga visigeḍināmanasu
sinninavvula kaṭṭe sĕlarem̐gĕrā
(||iṁduge||)
ūragesallagāligi ussurane niṭṭūrbu
ārasi nīdāvise payyaravārĕnu
joruna meghamu sūsi jŏbbileḍisĕmaḍalu
tāri nīgaruṇa niḍa dappiderĕnu
(||iṁduge||)
guṭṭuna kovĕlagūm̐tagunu jallurane guṁḍĕ
muṭṭi ninnum̐ gaum̐giliṁchi mohiṁcherā
yiṭṭe śhrīveṁkaḍeśha yiṁta sesi kūḍidivi
ṟaṭṭu paḍḍa nāvaya sāluḍi kĕkkĕnu