ఇందుకే వెరగయ్యీ నన్నెంచుకొంటేనూ
(॥పల్లవి॥)
ఇందుకే వెరగయ్యీ నన్నెంచుకొంటేనూ
పందను దైవాన కెట్టు బాఁ తైతినో నేనూ
(॥ఇందుకే॥)
యెన్కికకూ మాని సంటా నెట్టు వుట్టించె దైవము
పన్ని యాఁడువా రే మన్నఁ బంత మిత్తును
వున్నమచందురునకు పువ్వులమొనలకును
వెన్నెలబాయిటికిని వెరతు నేనూ
(॥ఇందుకే॥)
యెందుకుఁ గొ రౌదు నంటా యెట్టు వెంచె దైవము
ముందె ముట్టునెత్తురుముద్దను నేనూ
అంది చనుగొండలలో నధరామృతములలో
అందందె పొట్టువొర లైయలతు నేనూ
(॥ఇందుకే॥)
యెక్కడిదొర న న న్నేలె శ్రీవెంకటేశుఁడు
మక్కువఁ బయ్యదకొంగమాఁటువాఁడనూ
చక్కెరమాఁటలకును జంకెనబొమ్మలకును
పక్కన లో నై యట్టె భ్రమతు నేనూ
(||pallavi||)
iṁduge vĕragayyī nannĕṁchugŏṁṭenū
paṁdanu daivāna kĕṭṭu bām̐ taidino nenū
(||iṁduge||)
yĕnkigagū māni saṁṭā nĕṭṭu vuṭṭiṁchĕ daivamu
panni yām̐ḍuvā re mannam̐ baṁta mittunu
vunnamasaṁdurunagu puvvulamŏnalagunu
vĕnnĕlabāyiḍigini vĕradu nenū
(||iṁduge||)
yĕṁdugum̐ gŏ raudu naṁṭā yĕṭṭu vĕṁchĕ daivamu
muṁdĕ muṭṭunĕtturumuddanu nenū
aṁdi sanugŏṁḍalalo nadharāmṛtamulalo
aṁdaṁdĕ pŏṭṭuvŏra laiyaladu nenū
(||iṁduge||)
yĕkkaḍidŏra na na nnelĕ śhrīvĕṁkaḍeśhum̐ḍu
makkuvam̐ bayyadagŏṁgamām̐ṭuvām̐ḍanū
sakkĕramām̐ṭalagunu jaṁkĕnabŏmmalagunu
pakkana lo nai yaṭṭĕ bhramadu nenū