(॥పల్లవి॥)
ఇందుకే వెరగయ్యీ మాకు
అందపు రమణుఁడు అతఁడే యెఱుగు
(॥ఇందుకే॥)
చెలిచిగురుమోవి చిత్తజునడిదము
వొలకుఁదేనె లె ట్లులికెనో
కులుకుఁజూపు పతిగుండెబెదరు లవి
కలికివెన్నె లెటు గాసీవో
(॥ఇందుకే॥)
కాంతకుచంబులు గట్టికొండ లవి
దొంతివల పెట్లఁ దొరిగోనో
పంతపునడు మది బట్టబయలు గిలి
గింత నెట్లఁ గరఁగీనో తానూ
(॥ఇందుకే॥)
తరుణిదేహ మింతయు బంగారమె
సొరిదిరతుల నెట్టు చొక్కెనో
యిరవుగ శ్రీవెంకటేశ్వరుఁడు గూడెను
అరిది విభవము లెట్లబ్బెనో
(||pallavi||)
iṁduge vĕragayyī māgu
aṁdabu ramaṇum̐ḍu adam̐ḍe yĕṟugu
(||iṁduge||)
sĕlisigurumovi sittajunaḍidamu
vŏlagum̐denĕ lĕ ṭluligĕno
kulugum̐jūbu padiguṁḍĕbĕdaru lavi
kaligivĕnnĕ lĕḍu gāsīvo
(||iṁduge||)
kāṁtagusaṁbulu gaṭṭigŏṁḍa lavi
dŏṁtivala pĕṭlam̐ dŏrigono
paṁtabunaḍu madi baṭṭabayalu gili
giṁta nĕṭlam̐ garam̐gīno tānū
(||iṁduge||)
taruṇideha miṁtayu baṁgāramĕ
sŏridiradula nĕṭṭu sŏkkĕno
yiravuga śhrīvĕṁkaḍeśhvarum̐ḍu gūḍĕnu
aridi vibhavamu lĕṭlabbĕno