ఇందుకే వెరగయ్యీ మా కిందులో నిన్నుఁ జూచి
(॥పల్లవి॥)
ఇందుకే వెరగయ్యీ మా కిందులో నిన్నుఁ జూచి
సందడి సరసముల చలము కొనేవే
(॥ఇందు॥)
కాఁకల విభునిఁ జూచి కనురెప్ప వేయవు
యేఁకట నీమది నింక నెంత గలదే
ఆఁకల మెడగట్టుక అతఁడు నీకున్నవాఁడు
వాఁకల వలపు పరవంజు కొనేవే
(॥ఇందు॥)
నున్నని మాటలాడియు నోరఁ గాయ వేయవు
యెన్నిక నీమది నింక నెంత గలదే
చన్నుల తుదలనే సరసుఁడు వున్నవాఁడు
పన్నిన రతులకెల్ల బార చాఁచేవే
(॥ఇందు॥)
నిండఁ గాఁగిలించుకొని నీలోనఁ దనియవు
యెండల నీడల యాస యెంత గలదే
అండ శ్రీ వేంకటేశుఁడు అంది పాయకున్నవాఁడు
గండి తమకము లెల్ల గాదెఁ బోసేవే
(||pallavi||)
iṁduge vĕragayyī mā kiṁdulo ninnum̐ jūsi
saṁdaḍi sarasamula salamu kŏneve
(||iṁdu||)
kām̐kala vibhunim̐ jūsi kanurĕppa veyavu
yem̐kaḍa nīmadi niṁka nĕṁta galade
ām̐kala mĕḍagaṭṭuga adam̐ḍu nīgunnavām̐ḍu
vām̐kala valabu paravaṁju kŏneve
(||iṁdu||)
nunnani māḍalāḍiyu noram̐ gāya veyavu
yĕnniga nīmadi niṁka nĕṁta galade
sannula tudalane sarasum̐ḍu vunnavām̐ḍu
pannina radulagĕlla bāra sām̐seve
(||iṁdu||)
niṁḍam̐ gām̐giliṁchugŏni nīlonam̐ daniyavu
yĕṁḍala nīḍala yāsa yĕṁta galade
aṁḍa śhrī veṁkaḍeśhum̐ḍu aṁdi pāyagunnavām̐ḍu
gaṁḍi tamagamu lĕlla gādĕm̐ boseve