Imduge po visaaraana nimti vunnadi

ఇందుకే పో విచారాన నింతి వున్నది
Language

(॥పల్లవి॥)
ఇందుకే పో విచారాన నింతి వున్నది
చందమైన జవరాలు జంకెన కోరుచునా

(॥॥)
గుత్తపు మనసులోని గుట్టు విడువఁగరాదు
చిత్తము లోపలి మాఁట చెప్పక పోదు
పొత్తునఁ బెట్టుకొంటివి పొలతుల నందరిని
యెత్తైన పట్టిపుదేవి యెంగిలికోరుచునా

(॥॥)
ముంచిన చుట్టరికెపు మొగమోటెంతైనాఁ గద్దు
యెంచవలె నీ మేకులు యీపొద్దు
మంచ మెక్కించుకొంటివి మగువల నిందరిని
అంచితపు టిల్లాలు అఱడి కోరుచునా

(॥॥)
వాడికె కూటపురతి వలపులు గడువేఁడి
తోడఁ గూడిన చన్నుల తుదలు వాఁడి
వీడేలందుకొంటివి శ్రీవేంకటేశ యిందరిచే-
నీడైన మోహపుటింతి యింతేసి కోరుచునా

(||pallavi||)
iṁduge po visārāna niṁti vunnadi
saṁdamaina javarālu jaṁkĕna korusunā

(||||)
guttabu manasuloni guṭṭu viḍuvam̐garādu
sittamu lobali mām̐ṭa sĕppaga podu
pŏttunam̐ bĕṭṭugŏṁṭivi pŏladula naṁdarini
yĕttaina paṭṭibudevi yĕṁgiligorusunā

(||||)
muṁchina suṭṭarigĕbu mŏgamoḍĕṁtainām̐ gaddu
yĕṁchavalĕ nī megulu yībŏddu
maṁcha mĕkkiṁchugŏṁṭivi maguvala niṁdarini
aṁchidabu ṭillālu aṟaḍi korusunā

(||||)
vāḍigĕ kūḍaburadi valabulu gaḍuvem̐ḍi
toḍam̐ gūḍina sannula tudalu vām̐ḍi
vīḍelaṁdugŏṁṭivi śhrīveṁkaḍeśha yiṁdarise-
nīḍaina mohabuḍiṁti yiṁtesi korusunā