ఇందుకే పో వెరగయ్యీ నేమందును
(॥పల్లవి॥)
ఇందుకే పో వెరగయ్యీ నేమందును
కుందులేని నీమహిమ కొనియాడఁగలనా
(॥ఇందు॥)
అటు దేవతల కెల్ల నమృతమిచ్చిన నీవు
యిటు వెన్నదొంగిలుట కేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు
సట రోలఁ గట్టువడ్డ చందాన కేమందును
(॥ఇందు॥)
కలిగి యాకరిరాజుఁ గరుణఁ గాచిన నీవు
యిల నావులఁ గాచుట కేమందును
తలఁప బ్రహ్మాదిదేవతలకుఁ జిక్కని నీవు
చెలుల కాఁగిళ్లకుఁ జిక్కితి వేమందును
(॥ఇందు॥)
భావించ నన్నింటకంటేఁ బరమమూ ర్తివి నీవు
యీవల బాలుఁడవై తి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీవేంకటాద్రి నిలిచితి వేమందును
(||pallavi||)
iṁduge po vĕragayyī nemaṁdunu
kuṁduleni nīmahima kŏniyāḍam̐galanā
(||iṁdu||)
aḍu devadala kĕlla namṛtamichchina nīvu
yiḍu vĕnnadŏṁgiluḍa kemaṁdunu
paḍugadi balīṁdruni baṁdhiṁchinaṭṭi nīvu
saḍa rolam̐ gaṭṭuvaḍḍa saṁdāna kemaṁdunu
(||iṁdu||)
kaligi yāgarirājum̐ garuṇam̐ gāsina nīvu
yila nāvulam̐ gāsuḍa kemaṁdunu
talam̐pa brahmādidevadalagum̐ jikkani nīvu
sĕlula kām̐giḽlagum̐ jikkidi vemaṁdunu
(||iṁdu||)
bhāviṁcha nanniṁṭagaṁṭem̐ baramamū rdivi nīvu
yīvala bālum̐ḍavai ti vemaṁdunu
kāviṁchi brahmāṁḍālu kaḍubuna niḍugŏni
śhrīveṁkaḍādri nilisidi vemaṁdunu