ఇందుకే పో నిన్ను దూరే దెప్పుడు నోయి
(॥పల్లవి॥)
ఇందుకే పో నిన్ను దూరే దెప్పుడు నోయి
దిందుపడ నీ గుణాలు తెలుసుకో వోఇ
(॥ఇందు॥)
చెట్టవట్టి తియ్యఁగాను చేసన్న సేయఁగాను
వట్టి పరాకులు నేఁడు వలదోయి
నెట్టన నే నవ్వఁగాను నేరుపులు చూపఁగాను
కట్టగడ వారితోడి కత లేలోయి
(॥ఇందు॥)
చెక్కులు నే నొక్కఁగాను చిగురుమో వియ్యఁగాను
యెక్కడ చూచేవు చిత్తమెందున్నదోఇ
మొక్కులు నే మొక్కఁగాను మోహములుచల్లఁగాను
మక్కళించి చెలులతో మాటలేఁటికోయి
(॥ఇందు॥)
కమ్మర జంకించఁగాను కాఁగిలించుకొనఁగాను
యెమ్మెలునేతులు నింకా నేఁటికోఇ
నెమ్మది శ్రీ వేంకటేశ నీవే నన్నుఁగూడితివి
చిమ్ముల నావయసు నీచేతిది గదోయి
(||pallavi||)
iṁduge po ninnu dūre dĕppuḍu noyi
diṁdubaḍa nī guṇālu tĕlusugo voi
(||iṁdu||)
sĕṭṭavaṭṭi tiyyam̐gānu sesanna seyam̐gānu
vaṭṭi parāgulu nem̐ḍu valadoyi
nĕṭṭana ne navvam̐gānu nerubulu sūbam̐gānu
kaṭṭagaḍa vāridoḍi kada leloyi
(||iṁdu||)
sĕkkulu ne nŏkkam̐gānu sigurumo viyyam̐gānu
yĕkkaḍa sūsevu sittamĕṁdunnadoi
mŏkkulu ne mŏkkam̐gānu mohamulusallam̐gānu
makkaḽiṁchi sĕlulado māḍalem̐ṭigoyi
(||iṁdu||)
kammara jaṁkiṁcham̐gānu kām̐giliṁchugŏnam̐gānu
yĕmmĕlunedulu niṁkā nem̐ṭigoi
nĕmmadi śhrī veṁkaḍeśha nīve nannum̐gūḍidivi
simmula nāvayasu nīsedidi gadoyi