Imduge po nenu mee yimtigi vachchidi

ఇందుకే పో నేను మీ యింటికి వచ్చితి
Language

(॥పల్లవి॥)
ఇందుకే పో నేను మీ యింటికి వచ్చితి
పొంద కింక నేఁ బోనియ్య నిన్ను

(॥ఇందుకే॥)
కలికి నీ చూపులు కన్నుల నుండఁగ
నలువంక మమ్ము నాటీ నేలే
పిలువక మమ్ముఁ బిలిచే మోవి
వొలుకుఁదేనెల నూరించీని

(॥ఇందుకే॥)
బాపు నీ కుచములు పయ్యద నుండఁగ
రేపువలపులు రేఁచీ మమ్ము
నీపైనే వుండఁగ నీ చక్కఁదనము
యేపున నా మన సెలయించీని

(॥ఇందుకే॥)
చేయి చెక్కుతోడఁ జిమ్మే నీసిగ్గులు
ఆయములు దాఁకీ నద్దో మమ్ము
యీయెడ శ్రీవెంటేశుఁడ నే నిన్నుఁ
బాయక కూడఁగఁ బంత మాడేవూ

(||pallavi||)
iṁduge po nenu mī yiṁṭigi vachchidi
pŏṁda kiṁka nem̐ boniyya ninnu

(||iṁduge||)
kaligi nī sūbulu kannula nuṁḍam̐ga
naluvaṁka mammu nāḍī nele
piluvaga mammum̐ bilise movi
vŏlugum̐denĕla nūriṁchīni

(||iṁduge||)
bābu nī kusamulu payyada nuṁḍam̐ga
rebuvalabulu rem̐sī mammu
nībaine vuṁḍam̐ga nī sakkam̐danamu
yebuna nā mana sĕlayiṁchīni

(||iṁduge||)
seyi sĕkkudoḍam̐ jimme nīsiggulu
āyamulu dām̐kī naddo mammu
yīyĕḍa śhrīvĕṁṭeśhum̐ḍa ne ninnum̐
bāyaga kūḍam̐gam̐ baṁta māḍevū