ఇందుకే పో నీపైఁ గోప మేడనుండైనా వచ్చు
(॥పల్లవి॥)
ఇందుకే పో నీపైఁ గోప మేడనుండైనా వచ్చు
యెందుండి విచ్చేసితి వేమోయి నీవు
(॥ఇందు॥)
చెంత మోము చూడఁగానే చేయివట్టి తీసేవు
యెంతదయలేనివాఁడ వేమోయి నీవు
చింతతో నే నుండఁగాను చిమ్మేవు నీవేడుకలు
యెంతకక్కూర్తి కాఁడ వేమోయి నీవు
(॥ఇందు॥)
ముంచి కన్నీరు జాఱఁగ ముట్టేవు నాచనుదోయి
ఇచుంక తగవెఱఁగ వేమోయి నీవు
మించె నాకైతేఁ జలము మెరసీ నీకైతే నవ్వు
యెంచవు కూళతనము యేమోయి నీవు
(॥ఇందు॥)
అవ్వలిమోమై వుండఁగా అట్టె కాఁగిటఁ గూడేవు
యెవ్వతె నీకు నేర్పె నేమోయి నీవు
రవ్వగా శ్రీవేంకటేశ రతి నన్నుఁ జొక్కించి
యివ్వలిమోము సేసితి వేమోయి నీవు
(||pallavi||)
iṁduge po nībaim̐ goba meḍanuṁḍainā vachchu
yĕṁduṁḍi vichchesidi vemoyi nīvu
(||iṁdu||)
sĕṁta momu sūḍam̐gāne seyivaṭṭi tīsevu
yĕṁtadayalenivām̐ḍa vemoyi nīvu
siṁtado ne nuṁḍam̐gānu simmevu nīveḍugalu
yĕṁtagakkūrdi kām̐ḍa vemoyi nīvu
(||iṁdu||)
muṁchi kannīru jāṟam̐ga muṭṭevu nāsanudoyi
isuṁka tagavĕṟam̐ga vemoyi nīvu
miṁchĕ nāgaidem̐ jalamu mĕrasī nīgaide navvu
yĕṁchavu kūḽadanamu yemoyi nīvu
(||iṁdu||)
avvalimomai vuṁḍam̐gā aṭṭĕ kām̐giḍam̐ gūḍevu
yĕvvadĕ nīgu nerbĕ nemoyi nīvu
ravvagā śhrīveṁkaḍeśha radi nannum̐ jŏkkiṁchi
yivvalimomu sesidi vemoyi nīvu