ఇందుకే నేఁ జింతించే నెటువలె నున్నాఁడవో
(॥పల్లవి॥)
ఇందుకే నేఁ జింతించే నెటువలె నున్నాఁడవో
సందడి పెండ్లిండ్లాయ సరుస నీబతుకు
(॥ఇందు॥)
చెంతలనాకె నీపైఁ జేయిచాచగాను
వంతుకు జేయిచాఁచితి నవ్వల నే నుండి
యింతుల మిద్దరమును ఇరువంకలా నుండఁగా
సంతకూటమాయ నిదె చక్కనినీమేను
(॥ఇందు॥)
ఆకడ నాకె నీకు నాకుమడిచియ్యఁగాను
యీకడ నేనూ నీకు నిచ్చితి నిట్టె
కైకొని యిద్దరు నూడిగము నీకుఁజేయఁగాను
కాకుపడి కలగూరగంపాయ నీనోరు
(॥ఇందు॥)
గక్కన నాపె నిన్నుఁ గాఁగిటఁ గూడఁగాను
వొక్కటై నేనూ నట్టే వొనరఁగాను
యిక్కువ శ్రీవేంకటేశ యెనసి యిద్దరివల్లా
అక్కర నురిపేకళ్ల మాయను నీవురము
(||pallavi||)
iṁduge nem̐ jiṁtiṁche nĕḍuvalĕ nunnām̐ḍavo
saṁdaḍi pĕṁḍliṁḍlāya sarusa nībadugu
(||iṁdu||)
sĕṁtalanāgĕ nībaim̐ jeyisāsagānu
vaṁtugu jeyisām̐sidi navvala ne nuṁḍi
yiṁtula middaramunu iruvaṁkalā nuṁḍam̐gā
saṁtagūḍamāya nidĕ sakkaninīmenu
(||iṁdu||)
āgaḍa nāgĕ nīgu nāgumaḍisiyyam̐gānu
yīgaḍa nenū nīgu nichchidi niṭṭĕ
kaigŏni yiddaru nūḍigamu nīgum̐jeyam̐gānu
kāgubaḍi kalagūragaṁpāya nīnoru
(||iṁdu||)
gakkana nābĕ ninnum̐ gām̐giḍam̐ gūḍam̐gānu
vŏkkaḍai nenū naṭṭe vŏnaram̐gānu
yikkuva śhrīveṁkaḍeśha yĕnasi yiddarivallā
akkara nuribegaḽla māyanu nīvuramu