Imduge neevu vachchidi veedane ne nunnavaamda

ఇందుకే నీవు వచ్చితి వీడనే నే నున్నవాఁడ
Language

(॥పల్లవి॥)
ఇందుకే నీవు వచ్చితి వీడనే నే నున్నవాఁడ
విందువంటి నీ గుణాలు వేవేలు గదవే

(॥॥)
మట్టెలు గల్లురనఁగ మగువ యెందు వోయేవే
యిట్టేనీ కెదురుచూచి యీడ నున్నాఁడ
కట్టిన నీదవ్వఁటము గజభజించఁగ నీ-
దిట్టమాట లివి మాకు దెలియవు గదవే

(॥॥)
వెదచల్లువాసనతో వెదకే వెవ్వరినే
యిదె నీవు రమ్మనగా నీడ నున్నాఁడ
కదిసి నీముంజేతికంకాణాలరవళికి
చదల నీవిన్నపాలు సందడినే వున్నవే

(॥॥)
కలకలనవ్వులతో కమ్మటి నేమిచూచేవే
యెలిమి నిన్నుఁగాచుక యీడ నున్నాడ
చెలఁగి కూడితి నిదె శ్రీవేంకటేశుఁడ నిన్ను
పలుకుఁబంతము నింతబలువాయఁగదవే

(||pallavi||)
iṁduge nīvu vachchidi vīḍane ne nunnavām̐ḍa
viṁduvaṁṭi nī guṇālu vevelu gadave

(||||)
maṭṭĕlu galluranam̐ga maguva yĕṁdu voyeve
yiṭṭenī kĕdurusūsi yīḍa nunnām̐ḍa
kaṭṭina nīdavvam̐ṭamu gajabhajiṁcham̐ga nī-
diṭṭamāḍa livi māgu dĕliyavu gadave

(||||)
vĕdasalluvāsanado vĕdage vĕvvarine
yidĕ nīvu rammanagā nīḍa nunnām̐ḍa
kadisi nīmuṁjedigaṁkāṇālaravaḽigi
sadala nīvinnabālu saṁdaḍine vunnave

(||||)
kalagalanavvulado kammaḍi nemisūseve
yĕlimi ninnum̐gāsuga yīḍa nunnāḍa
sĕlam̐gi kūḍidi nidĕ śhrīveṁkaḍeśhum̐ḍa ninnu
palugum̐baṁtamu niṁtabaluvāyam̐gadave