ఇందుకె నవ్వు వచ్చీ నిదివో మాకు
(॥పల్లవి॥)
ఇందుకె నవ్వు వచ్చీ నిదివో మాకు
కందువ నుండి తానేల కన్నుల మొక్కీని
(॥॥)
ముంగిట నుండి నీవు మోము దప్పక చూచితే
అంగడి నుండిన చెలి యాసచేసెను
ఇంగిత మెరిఁగి తేను ఇద్దరికిఁ దగవే కా
సంగడినున్నయాకేల సరసమాడీని
(॥॥)
గొరబుగా నీవు వీది గుఱ్ఱమునెక్కి యాడితే
పొరగుననున్న యాకె పొందు గోరీని
అరసితే నిద్దరికి నమరుఁగా యీసేఁతలు
విరులుగొసేయాకేల వేడుకపడీని
(॥॥)
వొంటి నీవు పానుపుపై నూరకె పవ్వళించితే
వెంటవచ్చేయాకె నిన్ను వెసఁ గూడీని
అంటేఁ జెల్లుఁ గా యుద్దరి కందమౌ శ్రీ వేంకటేశ
యింట నన్నేలితి వేడోయీకె తా మెచ్చీని
(||pallavi||)
iṁdugĕ navvu vachchī nidivo māgu
kaṁduva nuṁḍi tānela kannula mŏkkīni
(||||)
muṁgiḍa nuṁḍi nīvu momu dappaga sūside
aṁgaḍi nuṁḍina sĕli yāsasesĕnu
iṁgida mĕrim̐gi tenu iddarigim̐ dagave kā
saṁgaḍinunnayāgela sarasamāḍīni
(||||)
gŏrabugā nīvu vīdi guṭramunĕkki yāḍide
pŏragunanunna yāgĕ pŏṁdu gorīni
araside niddarigi namarum̐gā yīsem̐talu
virulugŏseyāgela veḍugabaḍīni
(||||)
vŏṁṭi nīvu pānububai nūragĕ pavvaḽiṁchide
vĕṁṭavachcheyāgĕ ninnu vĕsam̐ gūḍīni
aṁṭem̐ jĕllum̐ gā yuddari kaṁdamau śhrī veṁkaḍeśha
yiṁṭa nannelidi veḍoyīgĕ tā mĕchchīni