Imduge kaambolu neevu yitte yavadharimchevu

ఇందుకే కాఁబోలు నీవు యిట్టే యవధరించేవు
Language

(॥పల్లవి॥)
ఇందుకే కాఁబోలు నీవు యిట్టే యవధరించేవు
కందువ లన్నియు నీమై గనియైనట్లుండే

(॥ఇందు॥)
హరి నీవు కప్పురకా పవధరించేవేళ
విరివిగా నిందరు భావించి చూచితే
తరుణుల నవ్వు లెల్లా దట్టిమై నీ మేనిమీఁద
పెరిగి పెరిగి యట్టే పేరినయ ట్లుండే

(॥ఇందు॥)
భువనేశ నీవు తట్టుపుణుఁగు చాఁతుకొనఁగ
యివల నాదాసు లెల్లా నెంచి చూచితే
కవగూడె నీ సతుల కనుచూపు లెల్లాను
తివిరి ఈమేనిమీఁద తిరమైన ట్లుండే

(॥ఇందు॥)
శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో
తావున మెఱసేది నేఁ దలఁచితేను
కోవరపు గొల్లెతల గుబ్బలకుంకుమనిగ్గు
వేవేలయి నీయందచ్చువేసినయట్లుండే

(||pallavi||)
iṁduge kām̐bolu nīvu yiṭṭe yavadhariṁchevu
kaṁduva lanniyu nīmai ganiyainaṭluṁḍe

(||iṁdu||)
hari nīvu kappuragā pavadhariṁcheveḽa
virivigā niṁdaru bhāviṁchi sūside
taruṇula navvu lĕllā daṭṭimai nī menimīm̐da
pĕrigi pĕrigi yaṭṭe perinaya ṭluṁḍe

(||iṁdu||)
bhuvaneśha nīvu taṭṭubuṇum̐gu sām̐tugŏnam̐ga
yivala nādāsu lĕllā nĕṁchi sūside
kavagūḍĕ nī sadula kanusūbu lĕllānu
tiviri īmenimīm̐da tiramaina ṭluṁḍe

(||iṁdu||)
śhrīveṁkaḍeśha nīsĕli yalamelmaṁgado
tāvuna mĕṟasedi nem̐ dalam̐sidenu
kovarabu gŏllĕdala gubbalaguṁkumaniggu
vevelayi nīyaṁdachchuvesinayaṭluṁḍe