ఇందుకే కాఁబోలు నీవు యిట్టే యవధరించేవు
(॥పల్లవి॥)
ఇందుకే కాఁబోలు నీవు యిట్టే యవధరించేవు
కందువ లన్నియు నీమై గనియైనట్లుండె
(॥ఇందు॥)
హరి నీవు కప్పురకా పవమధరించేవేళ
విరివిగా నిందరు భావించి చూచితే
తరుణులనవ్వులెల్లా దట్టమై నీమేనిమీఁద
పెరిగిపెరిగి యట్టే పేరినయేట్లుండె
(॥ఇందు॥)
భువనేశ నీవు తట్టుపుణుఁగు చాఁతుకొనఁగ
యివల నీదాసులెల్లా నెంచి చూచితే
కవగూడి నీసతులకనుచూపులెల్లాను
తివిరి నీమేనిమీఁద తిరమైనట్లుండె
(॥ఇందు॥)
శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో
తావున మెరసేది నేఁ దలఁచితేను
కోవరపు గొల్లెతలగుబ్బలకుంకుమనిగ్గు
వేవేలయి నీయం దచ్చువేసినయట్టుండె
(||pallavi||)
iṁduge kām̐bolu nīvu yiṭṭe yavadhariṁchevu
kaṁduva lanniyu nīmai ganiyainaṭluṁḍĕ
(||iṁdu||)
hari nīvu kappuragā pavamadhariṁcheveḽa
virivigā niṁdaru bhāviṁchi sūside
taruṇulanavvulĕllā daṭṭamai nīmenimīm̐da
pĕrigibĕrigi yaṭṭe perinayeṭluṁḍĕ
(||iṁdu||)
bhuvaneśha nīvu taṭṭubuṇum̐gu sām̐tugŏnam̐ga
yivala nīdāsulĕllā nĕṁchi sūside
kavagūḍi nīsadulaganusūbulĕllānu
tiviri nīmenimīm̐da tiramainaṭluṁḍĕ
(||iṁdu||)
śhrīveṁkaḍeśha nīsĕli yalamelmaṁgado
tāvuna mĕrasedi nem̐ dalam̐sidenu
kovarabu gŏllĕdalagubbalaguṁkumaniggu
vevelayi nīyaṁ dachchuvesinayaṭṭuṁḍĕ