Imduge kaa vibhumdu neeyimta nelagonnaamdu

ఇందుకే కా విభుఁడు నీయింట నెలకొన్నాఁడు
Language

(॥పల్లవి॥)
ఇందుకే కా విభుఁడు నీయింట నెలకొన్నాఁడు
కందు వెఱుఁగుదువు యీకత నీవే నేర్తువే

(॥ఇందు॥)
నయమెంత గలిగినా ననుపులకే మేలు
ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు
జయమెంత గలిగినా చనవులకే మేలు
క్రియ లెఱుఁగుదువు యీకీలు నీవే నేర్తువే

(॥ఇందు॥)
మొగమెంత చూచినా మొహానకే మూలము
తగవెంత నెరపినా తగులుకే మూలము
నగవెంట గలిగినాను నమ్మికలకు మూలము
పగ టెరుఁగుదువు యీపాడి నీవే నేర్తువే

(॥ఇందు॥)
వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు
వేడు కెంతనిలిపినా విఱ్ఱవీఁగుటకే దాపు
కూడితి విన్నిచందాల కోరిక శ్రీవేంకటేశు
జాడెఱుఁగుదువు సరసము సరసము నీవే నేర్తువు

(||pallavi||)
iṁduge kā vibhum̐ḍu nīyiṁṭa nĕlagŏnnām̐ḍu
kaṁdu vĕṟum̐guduvu yīgada nīve nerduve

(||iṁdu||)
nayamĕṁta galiginā nanubulage melu
priyamĕṁta galiginā pĕnabulage melu
jayamĕṁta galiginā sanavulage melu
kriya lĕṟum̐guduvu yīgīlu nīve nerduve

(||iṁdu||)
mŏgamĕṁta sūsinā mŏhānage mūlamu
tagavĕṁta nĕrabinā taguluge mūlamu
nagavĕṁṭa galiginānu nammigalagu mūlamu
paga ṭĕrum̐guduvu yībāḍi nīve nerduve

(||iṁdu||)
vūḍiga mĕṁtasesinā vŏddigalage dābu
veḍu kĕṁtanilibinā viṭravīm̐guḍage dābu
kūḍidi vinnisaṁdāla koriga śhrīveṁkaḍeśhu
jāḍĕṟum̐guduvu sarasamu sarasamu nīve nerduvu