Imdugamte nippude nee kechcharimchude melu

ఇందుకంటే నిప్పుడే నీ కెచ్చరించుటే మేలు
Language

(॥పల్లవి॥)
ఇందుకంటే నిప్పుడే నీ కెచ్చరించుటే మేలు
కందువ మఱచి వుంటేఁ గడుఁ బొద్దు వోదా

(॥॥)
హత్తి నాలో చింత వెళ్ళ నాడఁగా నీ మాటమీఁద
చిత్తము వచ్చిన యట్టు సేసేవు గాక
మొత్తాన నేను నిన్ను ముందు నేరా లెంచఁబోతే
మత్తిలి వెనక నీవు మనికితపడవా

(॥॥)
ఇంటికి వచ్చి యెదుట నిట్టె నిలుచుండఁగాను
నంటువ వలసినట్టు నవ్వేవు గాకా
వొంటి నేను విరహాన నుమ్మగిలఁగాఁ జూచి
అంటి ప్రియపడి మొక్క అంత సేయ కుందువా

(॥॥)
గక్కన నేనే నిన్నుఁ గౌఁగిలించుకొనఁగాను
నిక్కి వలసినట్టు మన్నించేవు గాక
యెక్కువ శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
గుక్కి సేను రాకుండితేఁ గొంకు నీకుఁ దీరునా.

(||pallavi||)
iṁdugaṁṭe nippuḍe nī kĕchchariṁchuḍe melu
kaṁduva maṟasi vuṁṭem̐ gaḍum̐ bŏddu vodā

(||||)
hatti nālo siṁta vĕḽḽa nāḍam̐gā nī māḍamīm̐da
sittamu vachchina yaṭṭu sesevu gāga
mŏttāna nenu ninnu muṁdu nerā lĕṁcham̐bode
mattili vĕnaga nīvu manigidabaḍavā

(||||)
iṁṭigi vachchi yĕduḍa niṭṭĕ nilusuṁḍam̐gānu
naṁṭuva valasinaṭṭu navvevu gāgā
vŏṁṭi nenu virahāna nummagilam̐gām̐ jūsi
aṁṭi priyabaḍi mŏkka aṁta seya kuṁduvā

(||||)
gakkana nene ninnum̐ gaum̐giliṁchugŏnam̐gānu
nikki valasinaṭṭu manniṁchevu gāga
yĕkkuva śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
gukki senu rāguṁḍidem̐ gŏṁku nīgum̐ dīrunā.