ఇందుకంటె నేమి సేతు నింకా నేను
(॥పల్లవి॥)
ఇందుకంటె నేమి సేతు నింకా నేను
నింద నీపైఁ బడీఁ జుమ్మీ నీ చిత్త మిఁకను
(॥ఇందు॥)
కొమ్మ నీ చూచినచూపే కొండ సేసుకొని నమ్మి
కమ్మి తలపోసుకొంటాఁ గాచుకున్నది
రమ్మన వెరచుఁగాని రాక కెదురుచూచీ
నెమ్మది నెరిఁగించితి నీచిత్తమిఁకను
(॥ఇందు॥)
కొచ్చి మీనవ్విన నవ్వే కొంగుముడియగా నెంచి
కచ్చుపెట్టి తమితోడఁ గాచుకున్నది
అచ్చలాన జలిమిసేయదుగాని పొందుగోరీ
నిచ్చలు నీపై పరాకే నీచిత్త మిఁకను
(॥ఇందు॥)
కోరీ నీవాడినమాటకుఁ గోటికిఁ బడిగెత్తి
గారవానఁ బనుపుపైఁ గాచుకున్నది
యీరీతి శ్రీవేంకేటేశ యిట్టె నీవు గూడితివి
నీరూపే తప్పక చీ నీచిత్తమిఁకను
(||pallavi||)
iṁdugaṁṭĕ nemi sedu niṁkā nenu
niṁda nībaim̐ baḍīm̐ jummī nī sitta mim̐kanu
(||iṁdu||)
kŏmma nī sūsinasūbe kŏṁḍa sesugŏni nammi
kammi talabosugŏṁṭām̐ gāsugunnadi
rammana vĕrasum̐gāni rāga kĕdurusūsī
nĕmmadi nĕrim̐giṁchidi nīsittamim̐kanu
(||iṁdu||)
kŏchchi mīnavvina navve kŏṁgumuḍiyagā nĕṁchi
kachchubĕṭṭi tamidoḍam̐ gāsugunnadi
achchalāna jalimiseyadugāni pŏṁdugorī
nichchalu nībai parāge nīsitta mim̐kanu
(||iṁdu||)
korī nīvāḍinamāḍagum̐ goḍigim̐ baḍigĕtti
gāravānam̐ banububaim̐ gāsugunnadi
yīrīdi śhrīveṁkeḍeśha yiṭṭĕ nīvu gūḍidivi
nīrūbe tappaga sī nīsittamim̐kanu