ఇందుకా యింత సేసితి విందాఁకాను
(॥పల్లవి॥)
ఇందుకా యింత సేసితి విందాఁకాను
అంది పొంది నీవే బదు కాఁటదాన నేనూ
(॥ఇందుకా॥)
వొలిసీ నొల్లనివాఁడ వూరకే ఆ సియ్యనేల
పొలసి అప్పుడే నన్నుఁ బొమ్మన రాదా
కులికి నేఁ గొసరఁగఁ గోమటిమేనరికమా
నెల వై సుఖాన నుండు నీవే వొక్కఁడవే
(॥ఇందుకా॥)
మనసు రానివాఁడవు మాతో నవ్వఁగ నేల
అనువు గాదని విడనాడఁగ రాదా
చనవున నిన్ను నాఁగ పరిఁ బత్రసాలామా
యెనయుచు నేకరాజ్య మేలవయ్యా నీవే
(॥ఇందుకా॥)
మాయలు సేసేవాఁడవు మమ్ము జాలిఁ బెట్టనేల
రాయి డేల మా యింటికి రా నన రాదా
ఆయ మంటి కూడితివి అలమేలుమంగ నేను
పాయపు శ్రీవెంకటేశ బడి నుండు మిఁకను
(||pallavi||)
iṁdugā yiṁta sesidi viṁdām̐kānu
aṁdi pŏṁdi nīve badu kām̐ṭadāna nenū
(||iṁdugā||)
vŏlisī nŏllanivām̐ḍa vūrage ā siyyanela
pŏlasi appuḍe nannum̐ bŏmmana rādā
kuligi nem̐ gŏsaram̐gam̐ gomaḍimenarigamā
nĕla vai sukhāna nuṁḍu nīve vŏkkam̐ḍave
(||iṁdugā||)
manasu rānivām̐ḍavu mādo navvam̐ga nela
anuvu gādani viḍanāḍam̐ga rādā
sanavuna ninnu nām̐ga parim̐ batrasālāmā
yĕnayusu negarājya melavayyā nīve
(||iṁdugā||)
māyalu sesevām̐ḍavu mammu jālim̐ bĕṭṭanela
rāyi ḍela mā yiṁṭigi rā nana rādā
āya maṁṭi kūḍidivi alamelumaṁga nenu
pāyabu śhrīvĕṁkaḍeśha baḍi nuṁḍu mim̐kanu