Imdugaa tollimaadalane ninnu yiyyagolibinadi neevu

ఇందుకా తొల్లిమాటలనే నిన్ను యియ్యకొలిపినది నీవు
Language

(॥పల్లవి॥)
ఇందుకా తొల్లిమాటలనే నిన్ను యియ్యకొలిపినది నీవు
కందువా నీవు సేసిన గురుతు ఘాతలై మాయ దిదివో

(॥ఇందు॥)
అంతవొద్దున నిన్నుఁ బిలువ నంపఁగా రావైతివి గాక
యింతులు పైకొని వలచితే నింతకంటె నవురా
యెంతసేసిన నీ చిత్తమే కాని యెప్పుడ నేఁ గోపగించరా
చెంతల నామేనికాఁక చేతనైనా ముట్టిరా నీవు

(॥ఇందు॥)
దొరవైతే మా యింటికి రా దోసమా యాలో వొల్లవుఁగాక
వొరసి తనుఁ దానే వచ్చినది వొల్లనాఁ బెట్టులురా
యిర వెఱిఁగి నీవు న న్నిట్ల యెంచి యిచ్చకము మానరా నీవు
కరఁగిన నా యరురులు కంటనైనాఁ జూడరా నీవు

(॥ఇందు॥)
కిమ్మరా నా మోహము నీవే కనవా యేలో దాఁచేవు గాక
సమ్మతించి నా మేనవారివాని చవుకలై యుండురా
నెమ్మది శ్రీవేంకటేశ్వర నీవేఁ నన్నుఁ గూడితివి నేఁడు
యిమ్ముల నీవే మేరవమీఱితివి యివి మరవకురా నీవు

(||pallavi||)
iṁdugā tŏllimāḍalane ninnu yiyyagŏlibinadi nīvu
kaṁduvā nīvu sesina gurudu ghādalai māya didivo

(||iṁdu||)
aṁtavŏdduna ninnum̐ biluva naṁpam̐gā rāvaidivi gāga
yiṁtulu paigŏni valaside niṁtagaṁṭĕ navurā
yĕṁtasesina nī sittame kāni yĕppuḍa nem̐ gobagiṁcharā
sĕṁtala nāmenigām̐ka sedanainā muṭṭirā nīvu

(||iṁdu||)
dŏravaide mā yiṁṭigi rā dosamā yālo vŏllavum̐gāga
vŏrasi tanum̐ dāne vachchinadi vŏllanām̐ bĕṭṭulurā
yira vĕṟim̐gi nīvu na nniṭla yĕṁchi yichchagamu mānarā nīvu
karam̐gina nā yarurulu kaṁṭanainām̐ jūḍarā nīvu

(||iṁdu||)
kimmarā nā mohamu nīve kanavā yelo dām̐sevu gāga
sammadiṁchi nā menavārivāni savugalai yuṁḍurā
nĕmmadi śhrīveṁkaḍeśhvara nīvem̐ nannum̐ gūḍidivi nem̐ḍu
yimmula nīve meravamīṟidivi yivi maravagurā nīvu