ఇందు వేరైనా దెల్లా నేఁటి మోహము
(॥పల్లవి॥)
ఇందు వేరైనా దెల్లా నేఁటి మోహము
కందువతో మనలోనే కలిగెఁగా మోహము
(॥ఇందు॥)
వనఁదగనిమాట వీనుటెపో మోహము
పొనిఁగి యంపినాను పోలె నిది మోహము
ననుచ నీ వొట్లకు నచ్చినది మోహము
కనుమూసినంతలోనే కాఁగుటే మోహము
(॥ఇందు॥)
తగిలి మాటాడి యాడి తనియనిది మోహము
మగుడి యెగ్గును సిగ్గు మఱచుటే మోహము
జగడాలకును గుండెజల్లనుటే మోహము
తెగి వెఱపెఱుఁగనిదే మోహము
(॥ఇందు॥)
బయలు మెఱసి కడుఁ బచ్చి వొంచుట మోహము
నయమున మంతనాలు నాటుకొంటే మోహము
జయమై శ్రీవేంకటేశ సమరతి మతములే
క్రియలతో వోలలాడి కెరలుటే మోహము
(||pallavi||)
iṁdu verainā dĕllā nem̐ṭi mohamu
kaṁduvado manalone kaligĕm̐gā mohamu
(||iṁdu||)
vanam̐daganimāḍa vīnuḍĕbo mohamu
pŏnim̐gi yaṁpinānu polĕ nidi mohamu
nanusa nī vŏṭlagu nachchinadi mohamu
kanumūsinaṁtalone kām̐guḍe mohamu
(||iṁdu||)
tagili māḍāḍi yāḍi taniyanidi mohamu
maguḍi yĕggunu siggu maṟasuḍe mohamu
jagaḍālagunu guṁḍĕjallanuḍe mohamu
tĕgi vĕṟabĕṟum̐ganide mohamu
(||iṁdu||)
bayalu mĕṟasi kaḍum̐ bachchi vŏṁchuḍa mohamu
nayamuna maṁtanālu nāḍugŏṁṭe mohamu
jayamai śhrīveṁkaḍeśha samaradi madamule
kriyalado volalāḍi kĕraluḍe mohamu