ఇందు నున్న దందూ నున్న దింతా మోహము
(॥పల్లవి॥)
ఇందు నున్న దందూ నున్న దింతా మోహము
కందువలెల్లా నిండె ఘనమైన మోహము
(॥ఇందు॥)
కన్నుల నిన్నుఁ జూచి కాంక్షలు తనివొందవు
వున్నతి రెప్పలతుద నుంది మోహము
చన్నులను నిన్ను నొత్తి జవ్వనము తనివోదు
పన్ని వురమునందే పాదుకొనె మోహము
(॥ఇందు॥)
పాటించి మాటలాడి భావము తనివందదు
వోటలేక పెదవుల నుంది మోహము
చిటకానఁ జెనకియు చేతులును దనివోవు
వూటువ గూడి గోళ్లకొన నుంది మోహము
(॥ఇందు॥)
నిక్కి నీ సేవలు సేసి నిలువెల్లాఁ దనివోదు
వొక్కటై దేహముమీఁద నుంది మోహము
గుక్కక శ్రీ వేంకటేశ కూడి ఇంకాఁ దనివోదు
పెక్కురతి బంధాలఁ బెనఁగొనీ మోహము
(||pallavi||)
iṁdu nunna daṁdū nunna diṁtā mohamu
kaṁduvalĕllā niṁḍĕ ghanamaina mohamu
(||iṁdu||)
kannula ninnum̐ jūsi kāṁkṣhalu tanivŏṁdavu
vunnadi rĕppaladuda nuṁdi mohamu
sannulanu ninnu nŏtti javvanamu tanivodu
panni vuramunaṁde pādugŏnĕ mohamu
(||iṁdu||)
pāḍiṁchi māḍalāḍi bhāvamu tanivaṁdadu
voḍalega pĕdavula nuṁdi mohamu
siḍagānam̐ jĕnagiyu sedulunu danivovu
vūḍuva gūḍi goḽlagŏna nuṁdi mohamu
(||iṁdu||)
nikki nī sevalu sesi niluvĕllām̐ danivodu
vŏkkaḍai dehamumīm̐da nuṁdi mohamu
gukkaga śhrī veṁkaḍeśha kūḍi iṁkām̐ danivodu
pĕkkuradi baṁdhālam̐ bĕnam̐gŏnī mohamu