Imdu ninnum dechchugomti nimka nemaneeno kaani

ఇందు నిన్నుఁ దెచ్చుకొంటి నిఁక నేమనీనో కాని
Language

(॥పల్లవి॥)
ఇందు నిన్నుఁ దెచ్చుకొంటి నిఁక నేమనీనో కాని
పందేలు వేసి పంతాలు పలికెఁబో యీకె

(॥ఇందు॥)
నేరుపుల మాఁటలాడి నెరజాణతనాలాడి
చేరి నీతోడుతఁ బొందుసే సెఁబో యాకె
కూరిములు వచరించి గురుతులు చెప్పి చెప్పి
కోరి నిన్ను లోనుసేసెకొనెఁబో యాకె

(॥ఇందు॥)
చుట్టరికములు చూపి చొక్కులను నిన్నుఁ బెట్టి
బెట్టుగాఁ జెనకి వలపించెఁబో యాకె
చుట్టి చుట్టి వచ్చి వచ్చి చూపులనే గిలిగించి
గుట్టుతోడ నిన్ను బాసగొనెఁబో యాకె

(॥ఇందు॥)
కానుకలు నీకొసఁగి కడుఁ గొలువులు సేసి
మానాన నిన్నాసలను నుంచెఁబో యాకె
యే నలమేల్మంగను నన్నేలితి శ్రీవేంకటేశ
తా నిన్నూ నిన్నాళ్ళదాఁకా దగిలెఁబో యాకె

(||pallavi||)
iṁdu ninnum̐ dĕchchugŏṁṭi nim̐ka nemanīno kāni
paṁdelu vesi paṁtālu paligĕm̐bo yīgĕ

(||iṁdu||)
nerubula mām̐ṭalāḍi nĕrajāṇadanālāḍi
seri nīdoḍudam̐ bŏṁduse sĕm̐bo yāgĕ
kūrimulu vasariṁchi gurudulu sĕppi sĕppi
kori ninnu lonusesĕgŏnĕm̐bo yāgĕ

(||iṁdu||)
suṭṭarigamulu sūbi sŏkkulanu ninnum̐ bĕṭṭi
bĕṭṭugām̐ jĕnagi valabiṁchĕm̐bo yāgĕ
suṭṭi suṭṭi vachchi vachchi sūbulane giligiṁchi
guṭṭudoḍa ninnu bāsagŏnĕm̐bo yāgĕ

(||iṁdu||)
kānugalu nīgŏsam̐gi kaḍum̐ gŏluvulu sesi
mānāna ninnāsalanu nuṁchĕm̐bo yāgĕ
ye nalamelmaṁganu nannelidi śhrīveṁkaḍeśha
tā ninnū ninnāḽḽadām̐kā dagilĕm̐bo yāgĕ