ఇందు నందు నెంచ భేద మెంతైనఁ గలదు
(॥పల్లవి॥)
ఇందు నందు నెంచ భేద మెంతైనఁ గలదు
చిందరవందరగాక చేతికి లోనయ్యీనా
(॥ఇందు॥)
దేవునిఁ గొలుచువాఁడు దేవునికి కొఱగాక
యీవల సంసారుల కేమి బాఁతి
కావరపు మనుజుల కని కొలిచేవారికి
దైవికము విచారించ తలఁ పున్నదా
(॥ఇందు॥)
పరము గోరేటివాఁడు పరమునకె కొఱగా
కిరవై యింద్రియముల కేమి బాఁతి
వొరసి భోగములలో నోలలాడే వానికి
అరిది మోక్షసుఖము లాసపడనున్నదా
(॥ఇందు॥)
పనిగొన్న భక్తివాఁడు భక్తికి కొఱగాక
యెనసి కర్మవిధుల కేమి బాఁతి
మని శ్రీవేంకటేశు మాయఁ జిక్కిన వానికి
తనిసి భవబంధముల దాఁటఁగఁ జోటున్నదా
(||pallavi||)
iṁdu naṁdu nĕṁcha bheda mĕṁtainam̐ galadu
siṁdaravaṁdaragāga sedigi lonayyīnā
(||iṁdu||)
devunim̐ gŏlusuvām̐ḍu devunigi kŏṟagāga
yīvala saṁsārula kemi bām̐ti
kāvarabu manujula kani kŏlisevārigi
daivigamu visāriṁcha talam̐ punnadā
(||iṁdu||)
paramu goreḍivām̐ḍu paramunagĕ kŏṟagā
kiravai yiṁdriyamula kemi bām̐ti
vŏrasi bhogamulalo nolalāḍe vānigi
aridi mokṣhasukhamu lāsabaḍanunnadā
(||iṁdu||)
panigŏnna bhaktivām̐ḍu bhaktigi kŏṟagāga
yĕnasi karmavidhula kemi bām̐ti
mani śhrīveṁkaḍeśhu māyam̐ jikkina vānigi
tanisi bhavabaṁdhamula dām̐ṭam̐gam̐ joḍunnadā