Imdu kela aluga maa yimtigi vichcheyavayya

ఇందు కేల అలుగ మా యింటికి విచ్చేయవయ్య
Language

(॥పల్లవి॥)
ఇందు కేల అలుగ మా యింటికి విచ్చేయవయ్య
ముందు ముందె నీకు నేము మొక్కేము గాని

(॥ఇందు కేల॥)
యేడ నైనా జేయి చాచే విందుకే పో సిగ్గువడి
ఆడరాని మాటలు నే నాడితిఁ గాక
జాడతో నేక మైతే సారె నీ వేమి సేసినా
కూడ దనేనా నీకు గుట్టు లేదు కాగ

(॥ఇందు కేల॥)
కొలువులో నుండి నీవు కొంగు వట్టి తియ్యఁగానె
వెలయఁగ విదిలించి వేసేఁ గాక
సెలవునఁ బానుపుపై నిన్నుఁ గసరుకొనఁగ
చలమా నీ కక్కూరితే జరుపేపు గాక

(॥ఇందు కేల॥)
నిద్దుర వోయేవేళ నీవు నన్ను లేపఁగాను
అద్దమరేతిరి వోప నంటిఁ గాక
యిద్దరము సమ్మతల్లి యిటువలెఁ గూడితిమి
అద్దో శ్రీవెంకటేశ అప్పు డేలో కాక

(||pallavi||)
iṁdu kela aluga mā yiṁṭigi vichcheyavayya
muṁdu muṁdĕ nīgu nemu mŏkkemu gāni

(||iṁdu kela||)
yeḍa nainā jeyi sāse viṁduge po sigguvaḍi
āḍarāni māḍalu ne nāḍidim̐ gāga
jāḍado nega maide sārĕ nī vemi sesinā
kūḍa danenā nīgu guṭṭu ledu kāga

(||iṁdu kela||)
kŏluvulo nuṁḍi nīvu kŏṁgu vaṭṭi tiyyam̐gānĕ
vĕlayam̐ga vidiliṁchi vesem̐ gāga
sĕlavunam̐ bānububai ninnum̐ gasarugŏnam̐ga
salamā nī kakkūride jarubebu gāga

(||iṁdu kela||)
niddura voyeveḽa nīvu nannu lebam̐gānu
addamarediri voba naṁṭim̐ gāga
yiddaramu sammadalli yiḍuvalĕm̐ gūḍidimi
addo śhrīvĕṁkaḍeśha appu ḍelo kāga