Imdu kaabenu rappimchu yevvarairemi

ఇందు కాపెను రప్పించు యెవ్వరైరేమి
Language

(॥పల్లవి॥)
ఇందు కాపెను రప్పించు యెవ్వరైరేమి
విందులకుఁ దిరుగఁగా వెంగెమాడేనా

(॥ఇందు॥)
యీపొద్దు వొంటి నుండఁగా యింటికిరమ్మంటిఁగాక
ఆపెతో మాటలాడఁగా అదేలనేనా
యేపున నీతలఁపోత యెఱఁగ కాడితిఁగా
కాపురాలు సేయఁగాను కాదనేనా

(॥ఇందు॥)
నివ్వెరగుతో నుండఁగా నిన్నెంచరించితిఁ గాక
యెవ్వతెకు మోమించినా యేఁటికనేనా
నివ్వటిలులు నీ గుణము నిశ్చఇంచనైతిఁ గాక
అవ్వలఁ బెండ్లి పనికి ఆరడి సేసేనా

(॥ఇందు॥)
పానుపుపై నుండఁగాను పాదము లొత్తితిఁగాక
యేనెలఁతకుఁ బొంచినా యెడచొచ్చేనా
కానిమ్మని నన్ను శ్రీవేంకటేశుఁడ కూడితివి
మానని చుట్టరికము మఱపించేనా

(||pallavi||)
iṁdu kābĕnu rappiṁchu yĕvvarairemi
viṁdulagum̐ dirugam̐gā vĕṁgĕmāḍenā

(||iṁdu||)
yībŏddu vŏṁṭi nuṁḍam̐gā yiṁṭigirammaṁṭim̐gāga
ābĕdo māḍalāḍam̐gā adelanenā
yebuna nīdalam̐poda yĕṟam̐ga kāḍidim̐gā
kāburālu seyam̐gānu kādanenā

(||iṁdu||)
nivvĕragudo nuṁḍam̐gā ninnĕṁchariṁchidim̐ gāga
yĕvvadĕgu momiṁchinā yem̐ṭiganenā
nivvaḍilulu nī guṇamu niśhcha̮iṁchanaidim̐ gāga
avvalam̐ bĕṁḍli panigi āraḍi sesenā

(||iṁdu||)
pānububai nuṁḍam̐gānu pādamu lŏttidim̐gāga
yenĕlam̐tagum̐ bŏṁchinā yĕḍasŏchchenā
kānimmani nannu śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidivi
mānani suṭṭarigamu maṟabiṁchenā