Imdave yaadamdu neegichchina sommu

ఇందవె యాతఁడు నీకిచ్చిన సొమ్ము
Language

(॥పల్లవి॥)
ఇందవె యాతఁడు నీకిచ్చిన సొమ్ము
కందువ నీ మేలులోని కాంతలము గదవే

(॥॥)
చిప్పిలుఁ జెమటలేలే సిగ్గులు వడఁగనేలే
తప్పక వినరాదా యాతని సుద్దులు
రెప్పలు మూసుకొనేవు రిచ్చ లోలో నన్వేవు
వొప్పుగాఁ బెండ్లికూఁతుర విప్పుడే యైతివా

(॥॥)
పయ్యద మరఁగులేలే భావపుఁగరఁగులేలే
ఇయ్యకొనవే చనవులిచ్చినాఁడు
వొయ్యనే మాటాడేవు వొగిఁ బాపట దువ్వేవు
ఇయ్యెడఁ గన్నెపడుచ విందుకే యైతివా

(॥॥)
బట్టబయలీఁ దనేలే పరాకు లిఁకనేలే
అట్టె వద్దకి రారాదా యాతఁడు వచ్చె
చుట్టమై శ్రీ వేంకటేశుఁడు తానె నిన్నుఁ గూడె
ఇట్టె పట్టపుదేవి వింతలో నయితివా

(||pallavi||)
iṁdavĕ yādam̐ḍu nīgichchina sŏmmu
kaṁduva nī meluloni kāṁtalamu gadave

(||||)
sippilum̐ jĕmaḍalele siggulu vaḍam̐ganele
tappaga vinarādā yādani suddulu
rĕppalu mūsugŏnevu richcha lolo nanvevu
vŏppugām̐ bĕṁḍligūm̐tura vippuḍe yaidivā

(||||)
payyada maram̐gulele bhāvabum̐garam̐gulele
iyyagŏnave sanavulichchinām̐ḍu
vŏyyane māḍāḍevu vŏgim̐ bābaḍa duvvevu
iyyĕḍam̐ gannĕbaḍusa viṁduge yaidivā

(||||)
baṭṭabayalīm̐ danele parāgu lim̐kanele
aṭṭĕ vaddagi rārādā yādam̐ḍu vachchĕ
suṭṭamai śhrī veṁkaḍeśhum̐ḍu tānĕ ninnum̐ gūḍĕ
iṭṭĕ paṭṭabudevi viṁtalo nayidivā