Imdavayyaa kaanige ni nnimtim dodidemmane

ఇందవయ్యా కానికె ని న్నింతిఁ దోడితెమ్మనె
Language

(॥పల్లవి॥)
ఇందవయ్యా కానికె ని న్నింతిఁ దోడితెమ్మనె
పొందైనచోటను పొసఁగఁగవలదా

(॥ఇంద॥)
వలచినదిగనక వనిత నిన్నుఁ బాసి
యెలమి దూరితే నెగ్గులేల పట్టేవు
చెలఁగి పెక్కుసతులఁ జేసుకొన్న వాఁడవు
పలుమారు మాఁటలఁబడ కిఁకఁబోవునా

(॥ఇంద॥)
అనుపైనది గనక నగుతా నీతోఁ బెనగి
చెనకితే నాఱడేల సేయవచ్చేవు
వొనర నెందరికైనా నొడిగట్టినవాఁడవు
తనివోని చేఁతలకుఁ దప్పించుకోవచ్చునా

(॥ఇంద॥)
వురముపైది గనక వువిద నీరతులను
వొరసికూడితేనేల వొడ్డుకొనేవు
సరవి శ్రీవేంకటేకశ జారపురుషుఁడవు
తిరమైన చన్నులతో దీకొనఁగవసమా

(||pallavi||)
iṁdavayyā kānigĕ ni nniṁtim̐ doḍidĕmmanĕ
pŏṁdainasoḍanu pŏsam̐gam̐gavaladā

(||iṁda||)
valasinadiganaga vanida ninnum̐ bāsi
yĕlami dūride nĕggulela paṭṭevu
sĕlam̐gi pĕkkusadulam̐ jesugŏnna vām̐ḍavu
palumāru mām̐ṭalam̐baḍa kim̐kam̐bovunā

(||iṁda||)
anubainadi ganaga nagudā nīdom̐ bĕnagi
sĕnagide nāṟaḍela seyavachchevu
vŏnara nĕṁdarigainā nŏḍigaṭṭinavām̐ḍavu
tanivoni sem̐talagum̐ dappiṁchugovachchunā

(||iṁda||)
vuramubaidi ganaga vuvida nīradulanu
vŏrasigūḍidenela vŏḍḍugŏnevu
saravi śhrīveṁkaḍegaśha jāraburuṣhum̐ḍavu
tiramaina sannulado dīgŏnam̐gavasamā