ఇందవయ్య మీసొమ్ము లేల మాకు
(॥పల్లవి॥)
ఇందవయ్య మీసొమ్ము లేల మాకు
క్రిందుపడి యెవ్వతె యెంగిలి నేల నన్నదో
(॥ఇంద॥)
చెట్ట వట్టి తియ్యంగానే చేయి దీసుకొనేవు
ఒట్టు వెట్టుకొని నన్ను నొల్లనంటాను
రట్టుగ నాముద్దుటుంగరము నీచేఁ జిక్కె నిదే
పెట్టుకో యెవ్వతెవ్రేలం బెట్టి వేసారినదో
(॥ఇంద॥)
పాదమువట్టుకొనంగానే పలుకవైతివి నాతో
ఆదరించంబడేనంటా అలుకతోడ
పేదవారము మాకాల పెండెముచిక్కెనిదె వో
ఏదెస నెవ్వతెకాలిదెరవుదెచ్చినదో
(॥ఇంద॥)
కోపగించుకొన్న నాకుం గొమ్మనుచుం గంటమాల
మేపెటితీపులచేత మెడంబెట్టేవు
ఏపలరఁదిరువేంకటేశ నాతోనిటువలె
నీపనికింత సేసితి వింక నేమిసేతువో
(||pallavi||)
iṁdavayya mīsŏmmu lela māgu
kriṁdubaḍi yĕvvadĕ yĕṁgili nela nannado
(||iṁda||)
sĕṭṭa vaṭṭi tiyyaṁgāne seyi dīsugŏnevu
ŏṭṭu vĕṭṭugŏni nannu nŏllanaṁṭānu
raṭṭuga nāmudduḍuṁgaramu nīsem̐ jikkĕ nide
pĕṭṭugo yĕvvadĕvrelaṁ bĕṭṭi vesārinado
(||iṁda||)
pādamuvaṭṭugŏnaṁgāne palugavaidivi nādo
ādariṁchaṁbaḍenaṁṭā alugadoḍa
pedavāramu māgāla pĕṁḍĕmusikkĕnidĕ vo
edĕsa nĕvvadĕgālidĕravudĕchchinado
(||iṁda||)
kobagiṁchugŏnna nāguṁ gŏmmanusuṁ gaṁṭamāla
mebĕḍidībulaseda mĕḍaṁbĕṭṭevu
ebalaram̐diruveṁkaḍeśha nādoniḍuvalĕ
nībanigiṁta sesidi viṁka nemiseduvo