ఇందవయ్య కానుకయిచ్చె నీకుఁ జెలియ
(॥పల్లవి॥)
ఇందవయ్య కానుకయిచ్చె నీకుఁ జెలియ
మందలించే నింటికాడ మగువతో నిన్నును
(॥ఇంద॥)
కలువరేకులవాఁడి కాంతచూపులనున్నది
వలరాజు నమ్ములకు వాసనే కాని
చలివేఁడి వలపులు చన్నులకొనల నవే
చెలువుఁడ నీవిఁకనేల సేసేవు జాగులు
(॥ఇంద॥)
ననిచిన చిగురెల్లా నాఁతిమోవినె వున్నది
వనముల మాకులెల్లా వట్టివే కాని
మనసుమర్మములెల్లా మాటలతుదలఁదోఁచె
ఘనుఁడవు యిఁకనేల కప్పేవు తమకము
(॥ఇంద॥)
నిండుమేఘము మెరుఁగు నెలఁతమోమున నిదే
వుండు మింటననే పేరు వొక్కటేకాని
కొండల శ్రీవేంకటేశ కూడితిరిద్దరు నేఁడు
గండికాఁడ యిఁకనేల కాదనేవు మాటలు
(||pallavi||)
iṁdavayya kānugayichchĕ nīgum̐ jĕliya
maṁdaliṁche niṁṭigāḍa maguvado ninnunu
(||iṁda||)
kaluvaregulavām̐ḍi kāṁtasūbulanunnadi
valarāju nammulagu vāsane kāni
salivem̐ḍi valabulu sannulagŏnala nave
sĕluvum̐ḍa nīvim̐kanela sesevu jāgulu
(||iṁda||)
nanisina sigurĕllā nām̐timovinĕ vunnadi
vanamula māgulĕllā vaṭṭive kāni
manasumarmamulĕllā māḍaladudalam̐dom̐sĕ
ghanum̐ḍavu yim̐kanela kappevu tamagamu
(||iṁda||)
niṁḍumeghamu mĕrum̐gu nĕlam̐tamomuna nide
vuṁḍu miṁṭanane peru vŏkkaḍegāni
kŏṁḍala śhrīveṁkaḍeśha kūḍidiriddaru nem̐ḍu
gaṁḍigām̐ḍa yim̐kanela kādanevu māḍalu