ఇందరునుఁ జూడఁగా నీ కెంత బలువు
(॥పల్లవి॥)
ఇందరునుఁ జూడఁగా నీ కెంత బలువు
విందువెట్టె మోవితేనె విడు విడవోయి
(॥ఇందరు॥)
పవ్వళించి నా విఁది పయ్యదకుఁ బెనఁగేవు
యెవ్వతెనీకుఁ జెప్పె నీ బుద్దులు
దువ్వటపుచీర యిది తొల్లే కడు నునుపు
పువ్వువలె జారీ నిట్టే పో పో విడవోయి
(॥ఇందరు॥)
వింతవుంగరము వెట్టి వేలు వట్టి తీసేవు
యెంతతడవు నే నుండి యెంచుకొంటివో
చెంతల నా గో రున్నది చేయమ్ముకంటె వాఁడి
పంతములు మాతోనుఁ జెప్పక విడవోయి
(॥ఇందరు॥)
వొడివట్టి తీసి నన్ను వొక్కటై కౌఁగిలించితి
వడరిఁ శ్రీవేంకటేశ అప్పుడే నీవు
జడియ గొండలవంటి చన్నులు మిక్కిలి నెత్తే
వెడఁగు నీయాసోదాలు విడువడవోయి
(||pallavi||)
iṁdarunum̐ jūḍam̐gā nī kĕṁta baluvu
viṁduvĕṭṭĕ movidenĕ viḍu viḍavoyi
(||iṁdaru||)
pavvaḽiṁchi nā vim̐di payyadagum̐ bĕnam̐gevu
yĕvvadĕnīgum̐ jĕppĕ nī buddulu
duvvaḍabusīra yidi tŏlle kaḍu nunubu
puvvuvalĕ jārī niṭṭe po po viḍavoyi
(||iṁdaru||)
viṁtavuṁgaramu vĕṭṭi velu vaṭṭi tīsevu
yĕṁtadaḍavu ne nuṁḍi yĕṁchugŏṁṭivo
sĕṁtala nā go runnadi seyammugaṁṭĕ vām̐ḍi
paṁtamulu mādonum̐ jĕppaga viḍavoyi
(||iṁdaru||)
vŏḍivaṭṭi tīsi nannu vŏkkaḍai kaum̐giliṁchidi
vaḍarim̐ śhrīveṁkaḍeśha appuḍe nīvu
jaḍiya gŏṁḍalavaṁṭi sannulu mikkili nĕtte
vĕḍam̐gu nīyāsodālu viḍuvaḍavoyi