Imdarunu vinamgaanu yemta sibbidai vumduno

ఇందరును వినఁగాను యెంత సిబ్బితై వుండునో
Language

(॥పల్లవి॥)
ఇందరును వినఁగాను యెంత సిబ్బితై వుండునో
మందలించి మంచముపై మాటలాడుకోరాదా

(॥ఇంద॥)
కాంత యేవిన్నపానకో కాచుకున్నది నీవద్ద
వింతలుగా నాలకించి వినరాదా
అంతవడిలోన నుండి అప్పటి వచ్చేముగాని
పొంత నిద్దరును తలపోసుకొనరాదా

(॥ఇంద॥)
లలన యెందుకో నీకు లాచి కొలువులు సేసీ
అలరి యాపను లాపె నడుగరాదా
బలిమి నందాఁకాను పరాకై వుండేముగాని
వెలి నాపె నీవు వెల్లావిరిచేసుకోరాదా

(॥ఇంద॥)
అంగనాకాంక్ష యెంతో ఆసపడీ నీయెదుట
చెంగట నాపెచనవు చెల్లించరాదా
రంగున శ్రీవేంకటేశ రతి నన్నుఁ గూడితివి
సంగతిగా నవ్వుకొంటా సరి మీరుండరాదా

(||pallavi||)
iṁdarunu vinam̐gānu yĕṁta sibbidai vuṁḍuno
maṁdaliṁchi maṁchamubai māḍalāḍugorādā

(||iṁda||)
kāṁta yevinnabānago kāsugunnadi nīvadda
viṁtalugā nālagiṁchi vinarādā
aṁtavaḍilona nuṁḍi appaḍi vachchemugāni
pŏṁta niddarunu talabosugŏnarādā

(||iṁda||)
lalana yĕṁdugo nīgu lāsi kŏluvulu sesī
alari yābanu lābĕ naḍugarādā
balimi naṁdām̐kānu parāgai vuṁḍemugāni
vĕli nābĕ nīvu vĕllāvirisesugorādā

(||iṁda||)
aṁganāgāṁkṣha yĕṁto āsabaḍī nīyĕduḍa
sĕṁgaḍa nābĕsanavu sĕlliṁcharādā
raṁguna śhrīveṁkaḍeśha radi nannum̐ gūḍidivi
saṁgadigā navvugŏṁṭā sari mīruṁḍarādā