ఇందరుఁ దెలిసినవే యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఇందరుఁ దెలిసినవే యీ సుద్దులు - వోరి
యందపు జాణతనా లవి యెట్టొ కాని
(॥ఇందరు॥)
యేకతమాడఁ బిలిచే వెఱుఁగుదు నే నాపని
నీకు నీకే యాడుకోరా నే నేఁటికి
యేకత మంటే నొక్కరే యిద్ద రుంటే రెండు గాదా
యీకడ విచారించవు యిది యేమో కాని
(॥ఇందరు॥)
నెత్తమాడ రమ్మనేవు నే నేమి యెఱఁగుదు
బొత్తుల నా మారు నీవే పూఁబాడకా
నెత్తమంటేఁ బాటిమీఁదినేలపేరు నీ వేల
తిత్తిఁ గట్టుకొని యేల తిరిగేవో కాని
(॥ఇందరు॥)
మెచ్చితిఁబో బాపు బాపు మేలనుచు నీకౌఁగిటఁ
గుచ్చే లిదె సందుగాఁగఁ గొరికక నన్ను
మెచ్చుగాదా నా కూటమి మేకుల శ్రీవేంకటేశ
కచ్చుపెట్టి యిందు కెంత కాచితివో కాని
(||pallavi||)
iṁdarum̐ dĕlisinave yī suddulu - vori
yaṁdabu jāṇadanā lavi yĕṭṭŏ kāni
(||iṁdaru||)
yegadamāḍam̐ bilise vĕṟum̐gudu ne nābani
nīgu nīge yāḍugorā ne nem̐ṭigi
yegada maṁṭe nŏkkare yidda ruṁṭe rĕṁḍu gādā
yīgaḍa visāriṁchavu yidi yemo kāni
(||iṁdaru||)
nĕttamāḍa rammanevu ne nemi yĕṟam̐gudu
bŏttula nā māru nīve pūm̐bāḍagā
nĕttamaṁṭem̐ bāḍimīm̐dinelaberu nī vela
tittim̐ gaṭṭugŏni yela tirigevo kāni
(||iṁdaru||)
mĕchchidim̐bo bābu bābu melanusu nīgaum̐giḍam̐
guchche lidĕ saṁdugām̐gam̐ gŏrigaga nannu
mĕchchugādā nā kūḍami megula śhrīveṁkaḍeśha
kachchubĕṭṭi yiṁdu kĕṁta kāsidivo kāni