Imdarum delisinave yee panulu

ఇందరుఁ దెలిసినవే యీ పనులు
Language

(॥పల్లవి॥)
ఇందరుఁ దెలిసినవే యీ పనులు
కందువ నీ పచ్చడము గప్పఁగరాదా

(॥ఇంద॥)
పంతమాడవచ్చుఁ గాని పాసి వుండఁగరాదు
దొంతరమాట లెందాఁకాఁ దొరలించేవు
యింతి నిన్ను వేఁడుకోఁగా నేఁటికిఁక బిగిసేవు
పొంతఁ గూచుండఁ బెట్టుక పోదిసేయరాదా

(॥ఇంద॥)
జంకించవచ్చుఁగాని చలముతో నుండరాదు
పొంకపుగుట్టు లెందాఁకాఁ బోహళించేవు
లంకెనాపె వెనఁగఁగ లావులేల చూపేవు
సంకెదీర నాపెతోడ సరసమాడరాదా

(॥ఇంద॥)
గయ్యాళించ వచ్చుఁ గాని కలయక మానరాదు
చయ్యాటాన నెందాఁకా సాముసేసేవు
ఇయ్యడ నలమేల్మంగ యెనసె శ్రీవేంకటేశ
నెయ్యమును నాపెతోనే నెట్టుకొనరాదా

(||pallavi||)
iṁdarum̐ dĕlisinave yī panulu
kaṁduva nī pachchaḍamu gappam̐garādā

(||iṁda||)
paṁtamāḍavachchum̐ gāni pāsi vuṁḍam̐garādu
dŏṁtaramāḍa lĕṁdām̐kām̐ dŏraliṁchevu
yiṁti ninnu vem̐ḍugom̐gā nem̐ṭigim̐ka bigisevu
pŏṁtam̐ gūsuṁḍam̐ bĕṭṭuga podiseyarādā

(||iṁda||)
jaṁkiṁchavachchum̐gāni salamudo nuṁḍarādu
pŏṁkabuguṭṭu lĕṁdām̐kām̐ bohaḽiṁchevu
laṁkĕnābĕ vĕnam̐gam̐ga lāvulela sūbevu
saṁkĕdīra nābĕdoḍa sarasamāḍarādā

(||iṁda||)
gayyāḽiṁcha vachchum̐ gāni kalayaga mānarādu
sayyāḍāna nĕṁdām̐kā sāmusesevu
iyyaḍa nalamelmaṁga yĕnasĕ śhrīveṁkaḍeśha
nĕyyamunu nābĕdone nĕṭṭugŏnarādā