ఇందరు నున్నారు మీతో నేమంటినే
(॥పల్లవి॥)
ఇందరు నున్నారు మీతో నేమంటినే
దిందుపడి తానేల తిట్టు దిట్టీనే
(॥॥)
తగవరితన మెల్లా తనదున్న దంటిఁ గాక
యెగసక్కేలకు మరి యేమంటినే
చిగురుమోవిమీఁద చిల్లులున్న వంటిఁ గాక
వెగటుగా నేనేమి వెంగెము లాడితినే
(॥॥)
మొక్కలపుఁ గళలెల్ల మోము నిండె నంటిఁ గాక
యెక్కడా లేని నేరాలేమంటినే
మిక్కిలి వాసనలు నీమేన మించె నంటిఁ గాక
నిక్కమూఁ గాంతలమీఁద నిందలేమాడితినే
(॥॥)
చీటికి మాటికిని మై చెమరించె నంటిఁ గాక
యేఁటికి నలసేవని యేమంటివే
గాఁటపు శ్రీవేంకటేశ కడపలో నన్నుఁ గూడి
యేఁట వెట్టేవంటిఁ గాక యేతులేమాడతినే
(||pallavi||)
iṁdaru nunnāru mīdo nemaṁṭine
diṁdubaḍi tānela tiṭṭu diṭṭīne
(||||)
tagavaridana mĕllā tanadunna daṁṭim̐ gāga
yĕgasakkelagu mari yemaṁṭine
sigurumovimīm̐da sillulunna vaṁṭim̐ gāga
vĕgaḍugā nenemi vĕṁgĕmu lāḍidine
(||||)
mŏkkalabum̐ gaḽalĕlla momu niṁḍĕ naṁṭim̐ gāga
yĕkkaḍā leni nerālemaṁṭine
mikkili vāsanalu nīmena miṁchĕ naṁṭim̐ gāga
nikkamūm̐ gāṁtalamīm̐da niṁdalemāḍidine
(||||)
sīḍigi māḍigini mai sĕmariṁchĕ naṁṭim̐ gāga
yem̐ṭigi nalasevani yemaṁṭive
gām̐ṭabu śhrīveṁkaḍeśha kaḍabalo nannum̐ gūḍi
yem̐ṭa vĕṭṭevaṁṭim̐ gāga yedulemāḍadine