ఇందరు నెరిఁగినవే యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఇందరు నెరిఁగినవే యీ సుద్దులు
యెందు నుండినాను మా యింటికి రావలెను
(॥॥)
యెంత వాఁడవైనాను యెపుడును మాతోను
పంతములాడకురా పలుమారును
కాంతల మోవి తేనెలు కైకొనేటి వేళను
పొంతనుండి యెంగిలికి పొత్తుగూడవలెను
(॥॥)
ఘనుఁడవౌదువు నేఁడు గర్వము మాతో సరి-
పెనఁగకురా నీవు పెచ్చు రేఁగుచు
వనితలైనవారు వడిఁ గాఁగిలించేవేళ
చనుఁగొండలసందీఁగి చనవియ్యవలెను
(॥॥)
మగఁడవైతివి నాకు మక్కువ శ్రీవెంకటేశ
బిగియకురా ఇంత పెనఁగుతాను
మగువలైనవారి మరిగి కూడేవేళ
పొగురుఁబాదములువీఁపున మోవవలెను
(||pallavi||)
iṁdaru nĕrim̐ginave yī suddulu
yĕṁdu nuṁḍinānu mā yiṁṭigi rāvalĕnu
(||||)
yĕṁta vām̐ḍavainānu yĕbuḍunu mādonu
paṁtamulāḍagurā palumārunu
kāṁtala movi tenĕlu kaigŏneḍi veḽanu
pŏṁtanuṁḍi yĕṁgiligi pŏttugūḍavalĕnu
(||||)
ghanum̐ḍavauduvu nem̐ḍu garvamu mādo sari-
pĕnam̐gagurā nīvu pĕchchu rem̐gusu
vanidalainavāru vaḍim̐ gām̐giliṁcheveḽa
sanum̐gŏṁḍalasaṁdīm̐gi sanaviyyavalĕnu
(||||)
magam̐ḍavaidivi nāgu makkuva śhrīvĕṁkaḍeśha
bigiyagurā iṁta pĕnam̐gudānu
maguvalainavāri marigi kūḍeveḽa
pŏgurum̐bādamuluvīm̐puna movavalĕnu