Imdaru neṟimginave yee suddulu

ఇందరు నెఱిఁగినవే యీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఇందరు నెఱిఁగినవే యీ సుద్దులు
యెందాకా జరపేవు యీ వెడమాయలు

(॥ఇంద॥)
చలములేమిటికి సతితోను నిన్నుఁ
బిలువ నంపినందుకుఁ బెనఁగేదా
సెలవుల నవ్వేరు చెలులెల్లా యీ
కలికిఁ బాసి వుండఁగలవా నీవు

(॥ఇంద॥)
పంతములేమిటికి పతితోను నీకు
నింతియై వుండినందుకు నిది పాటా
చెంతల జాతులఁ బెట్టీఁ జిలుకలెల్లా
పొంత నాపెను మీఱ నోపుదువా యిఁకను

(॥ఇంద॥)
వొరయ నేమిటికి నీవువిదతోను నీ
పరపుపై యాడుటకు ఫలమా యిది
నిరతి శ్రీవేంకటేశ నీమేని గుఱుతులు
సురతవేళల యీచొప్పు మాపఁగలవా

(||pallavi||)
iṁdaru nĕṟim̐ginave yī suddulu
yĕṁdāgā jarabevu yī vĕḍamāyalu

(||iṁda||)
salamulemiḍigi sadidonu ninnum̐
biluva naṁpinaṁdugum̐ bĕnam̐gedā
sĕlavula navveru sĕlulĕllā yī
kaligim̐ bāsi vuṁḍam̐galavā nīvu

(||iṁda||)
paṁtamulemiḍigi padidonu nīgu
niṁtiyai vuṁḍinaṁdugu nidi pāḍā
sĕṁtala jādulam̐ bĕṭṭīm̐ jilugalĕllā
pŏṁta nābĕnu mīṟa nobuduvā yim̐kanu

(||iṁda||)
vŏraya nemiḍigi nīvuvidadonu nī
parabubai yāḍuḍagu phalamā yidi
niradi śhrīveṁkaḍeśha nīmeni guṟudulu
suradaveḽala yīsŏppu mābam̐galavā