ఇందరు నెఱిఁగినవే యీ సుద్దులు
(॥పల్లవి॥)
ఇందరు నెఱిఁగినవే యీ సుద్దులు
యెందాఁకా వట్టిమాయ లేమిసేసే నిపుడు
(॥॥)
తప్పులుదారులు నన్ని తానె తేరీఁగాని
చెప్పరాదా నీమాట చేరి వినేను
అప్పట నుండియు నీవు ఆఇత్తపడే విట్టె
నెప్పున నీనిజములు నెరుపేవు సారెకు
(॥॥)
తీపులుఁగారాలు నిటెప తేటతెల్లవయ్యీఁగాని
చూపరాదా నీమోవి చూచే నేను
పైపై నే మల సేవు పంతగారితనమున
వోపికఁజెలుల నేమి నొడఁబరచేవు
(॥॥)
పాడియునుఁ బంతమును బాయిటఁబడీఁ గాని
కూడరాదా నీవు నన్నుఁగోరి మెచ్చేను
వేడుక నేలితివి శ్రీ వేంకటేశ ఇంతలోనే
యీడ నే నలమేల్మంగను ఇంపు నాకుఁ జేసేవు
(||pallavi||)
iṁdaru nĕṟim̐ginave yī suddulu
yĕṁdām̐kā vaṭṭimāya lemisese nibuḍu
(||||)
tappuludārulu nanni tānĕ terīm̐gāni
sĕpparādā nīmāḍa seri vinenu
appaḍa nuṁḍiyu nīvu āittabaḍe viṭṭĕ
nĕppuna nīnijamulu nĕrubevu sārĕgu
(||||)
tībulum̐gārālu niḍĕba teḍadĕllavayyīm̐gāni
sūbarādā nīmovi sūse nenu
paibai ne mala sevu paṁtagāridanamuna
vobigam̐jĕlula nemi nŏḍam̐barasevu
(||||)
pāḍiyunum̐ baṁtamunu bāyiḍam̐baḍīm̐ gāni
kūḍarādā nīvu nannum̐gori mĕchchenu
veḍuga nelidivi śhrī veṁkaḍeśha iṁtalone
yīḍa ne nalamelmaṁganu iṁpu nāgum̐ jesevu