Imdaru navve deramga devvado yeebe

ఇందరు నవ్వే దెరఁగ దెవ్వతో యీపె
Language

(॥పల్లవి॥)
ఇందరు నవ్వే దెరఁగ దెవ్వతో యీపె
యెందుకైనాఁ దానె వచ్చీ నెవ్వతో యీపె

(॥ఇందరు॥)
మచ్చికతో నీవు నేను మాట లాడఁగా విని
యెచ్చు కుందు లెంచ వచ్చీ నెవ్వతో యీపె
కుచ్చితాన తనలోన కోపము కొంత వెట్టుక
యిచ్చట మెచ్చులు మెచ్చీ నెవ్వతో యీపె

(॥ఇందరు॥)
నగుతా నిద్దరమును ననుపు నటించఁగాను
యెగసక్యములు సేసీ నెవ్వతో యీపె
తగవులు చెప్పుతాఁ గాఁతాళము గొంత రేఁచుక
యెగుసనఁ బెట్టీ రేసు లెవ్వతో యీపె

(॥ఇందరు॥)
నెయ్యపు శ్రీ వెంకటేశ నేఁడు మనము గూడఁగ
యియ్యకొని పూఁకోనీ నెవ్వతో యీపె
చయ్యాటా లిన్నియు మాని చవి సేసుక పొదిగి
యెయ్యెడ నున్నదో తాను యెవ్వతో యీపె

(||pallavi||)
iṁdaru navve dĕram̐ga dĕvvado yībĕ
yĕṁdugainām̐ dānĕ vachchī nĕvvado yībĕ

(||iṁdaru||)
machchigado nīvu nenu māḍa lāḍam̐gā vini
yĕchchu kuṁdu lĕṁcha vachchī nĕvvado yībĕ
kuchchidāna tanalona kobamu kŏṁta vĕṭṭuga
yichchaḍa mĕchchulu mĕchchī nĕvvado yībĕ

(||iṁdaru||)
nagudā niddaramunu nanubu naḍiṁcham̐gānu
yĕgasakyamulu sesī nĕvvado yībĕ
tagavulu sĕppudām̐ gām̐tāḽamu gŏṁta rem̐suga
yĕgusanam̐ bĕṭṭī resu lĕvvado yībĕ

(||iṁdaru||)
nĕyyabu śhrī vĕṁkaḍeśha nem̐ḍu manamu gūḍam̐ga
yiyyagŏni pūm̐konī nĕvvado yībĕ
sayyāḍā linniyu māni savi sesuga pŏdigi
yĕyyĕḍa nunnado tānu yĕvvado yībĕ