Imdaru naadani neraalela yemcheru

ఇందరు నాతని నేరాలేల యెంచేరు
Language

(॥పల్లవి॥)
ఇందరు నాతని నేరాలేల యెంచేరు
కందువ నాకు మగఁడు గాకుండఁ గలడా

(॥ఇంద॥)
నావిభుఁ డెవ్వతెతోడ నవ్వినా నవ్వెఁగాక నాఁ
భావములోఁ దను నిలుపఁగ నీయఁడా
వావు లెక్క డెక్కడ వడిఁ గలసి వుండినా
చేవమీరఁ బెండ్లాడె సేవించ నీయఁడా

(॥ఇంద॥)
మట్టు మీర నెవ్వతెతో మాటాడినా నాడెఁ గాక
అట్టె తనుపేరు నానో రంట నీయఁడా
వొట్టి తా నన్ను మరచి వుండినా నందు కేమాయ
గట్టి తనరూపు వాసి కనుఁగొన నీయఁడా

(॥ఇంద॥)
కోమలి నెవ్వతెను తాఁ గూడినాఁ గూడెఁ గాక
ఆమాట విని సంతస మంద నీయఁడా
చేముంచె నలమేల్మంగ శ్రీ వేంకటేశుఁడు తాను
కామించి నన్నేలె నిదె కడు మెచ్చనీయఁడా

(||pallavi||)
iṁdaru nādani nerālela yĕṁcheru
kaṁduva nāgu magam̐ḍu gāguṁḍam̐ galaḍā

(||iṁda||)
nāvibhum̐ ḍĕvvadĕdoḍa navvinā navvĕm̐gāga nām̐
bhāvamulom̐ danu nilubam̐ga nīyam̐ḍā
vāvu lĕkka ḍĕkkaḍa vaḍim̐ galasi vuṁḍinā
sevamīram̐ bĕṁḍlāḍĕ seviṁcha nīyam̐ḍā

(||iṁda||)
maṭṭu mīra nĕvvadĕdo māḍāḍinā nāḍĕm̐ gāga
aṭṭĕ tanuberu nāno raṁṭa nīyam̐ḍā
vŏṭṭi tā nannu marasi vuṁḍinā naṁdu kemāya
gaṭṭi tanarūbu vāsi kanum̐gŏna nīyam̐ḍā

(||iṁda||)
komali nĕvvadĕnu tām̐ gūḍinām̐ gūḍĕm̐ gāga
āmāḍa vini saṁtasa maṁda nīyam̐ḍā
semuṁchĕ nalamelmaṁga śhrī veṁkaḍeśhum̐ḍu tānu
kāmiṁchi nannelĕ nidĕ kaḍu mĕchchanīyam̐ḍā