Imdaru jaanale meeru yemani vinnavimchemu

ఇందరు జాణలే మీరు యేమని విన్నవించేము
Language

(॥పల్లవి॥)
ఇందరు జాణలే మీరు యేమని విన్నవించేము
సందడి గొల్లెతలము సంతోసించే మిదివో

(॥॥)
నిద్దరించేవానివలె నీవు పవ్వళించుండఁగా
నొద్దికతోఁ బాదాలొత్తే రువిదలు
వొద్దనున్న చెలులు వొండొరుల మోములు చూచి
తిద్దుకొన్న కురులతో తెరవేసే రదిగో

(॥॥)
అలసినవానివలె నంబరము గప్పుకోఁగా
మలసి నీదేవుళ్ళు మర్మములంటేరు
అలరి వూడిగపు వారందరూఁ దలలు వంచి
సెలవుల నవ్వి తలపులు మూసేరదిగో

(॥॥)
గుట్టుగలవానివలె కొమ్మల లోలోనె కూడి
నెట్టుకొని యిందరి లోనికిఁ బిల్వఁగా
వొట్టుక శ్రీవేంకటాద్రి నున్న గోవిందరాజనీ
చుట్టాలు కరుణఁజెంది చొక్కిమెచ్చేరదిగో

(||pallavi||)
iṁdaru jāṇale mīru yemani vinnaviṁchemu
saṁdaḍi gŏllĕdalamu saṁtosiṁche midivo

(||||)
niddariṁchevānivalĕ nīvu pavvaḽiṁchuṁḍam̐gā
nŏddigadom̐ bādālŏtte ruvidalu
vŏddanunna sĕlulu vŏṁḍŏrula momulu sūsi
tiddugŏnna kurulado tĕravese radigo

(||||)
alasinavānivalĕ naṁbaramu gappugom̐gā
malasi nīdevuḽḽu marmamulaṁṭeru
alari vūḍigabu vāraṁdarūm̐ dalalu vaṁchi
sĕlavula navvi talabulu mūseradigo

(||||)
guṭṭugalavānivalĕ kŏmmala lolonĕ kūḍi
nĕṭṭugŏni yiṁdari lonigim̐ bilvam̐gā
vŏṭṭuga śhrīveṁkaḍādri nunna goviṁdarājanī
suṭṭālu karuṇam̐jĕṁdi sŏkkimĕchcheradigo